‘ఆదిత్య 999’లో నందమూరి మోక్షజ్ఞ క్యారెక్టర్‌ ఇలా వుంటుంది..

యాక్షన్‌ హీరోగానే కాకుండా అన్నిరకాల క్యారెక్టర్స్‌ చేసి అందర్నీ మెప్పిస్తున్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌ స్టార్ట్‌ అయింది హీరోగా కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ‘తాతమ్మకల’ చిత్రంలో టీనేజ్‌లో వున్న కుర్రాడిగా నటించడం ద్వారా నటనకు శ్రీకారం చుట్టిన బాలయ్య స్టెప్‌ బై స్టెప్‌ ఎదుగుతూ నటసింహగా ఇప్పుడు అందరి అభిమానాన్ని పొందుతున్నాడు. తన ఎంట్రీలాగే కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా వుండాలని భావిస్తున్నాడు బాలయ్య.

ప్రస్తుతం బాలకృష్ణ తన కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా 100వ సినిమా మీదే పెడుతున్నాడు. వందో సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బాలయ్య… మోక్షజ్ఞను ఈ సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్‌ చెయ్యాలన్నది బాలయ్య ఆలోచన. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ పేరుతో రూపొందే 100వ సినిమాలో మోక్షజ్ఞ ఒక ఇంపార్టెంట్‌ రోల్‌ చెయ్యబోతున్నాడట. అయితే మోక్షజ్ఞ క్యారెక్టర్‌ ఎంతసేపు వుంటుందనే విషయం గురించి నందమూరి అభిమానులు తెగ డిస్కస్‌ చేసుకుంటున్నారట.

ఈ సినిమాలో మోక్షజ్ఞ చెయ్యబోతున్న క్యారెక్టర్‌ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. టైమ్‌ మెషీన్‌ని తయారు చేస్తున్నప్పుడు బాలకృష్ణ, ఓ సైంటిస్ట్‌ టెక్నికల్‌గా ఓ పెద్ద సమస్యను ఫేస్‌ చేస్తారు. ఆ టైమ్‌లో మోక్షజ్ఞ ఎంటర్‌ అయి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్‌ చేస్తాడట. ఈ చిత్రంలో మేథమేటిక్స్‌ మేధావిగా మోక్షజ్ఞ చెయ్యబోతున్న క్యారెక్టర్‌ కథను మలుపు తిప్పేదిగా వుంటుందట. టైమ్‌ మెషీన్‌లో ఏర్పడిన సమస్యని గణిత శాస్త్రంలోని ఓ ఈక్వేషన్‌ని ఉపయోగించి డిజిటల్‌ ప్రాసెస్‌లో సాల్వ్‌ చేస్తాడట. సినిమాలో మోక్షజ్ఞ క్యారెక్టర్‌ దాదాపు 10 నిముషాలు వుంటుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎలా వుంటుందనే విషయంలో ఎంతో క్యూరియాసిటీతో వున్న అభిమానులకు ఈ న్యూస్‌ డెఫినెట్‌గా సంతోషాన్ని కలిగిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close