బాలయ్య ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

నందమూరి నట సింహం బాలయ్య బాబు తన వందో సినిమా గురించి తుది నిర్ణయం ఈరోజు ఎనౌన్స్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అరడజను దర్శకుల కథలను వినడం అందరికి సరే అని తల ఊపడంతో బాలయ్య వందో సినిమా ఎవరితో ఉంటుంది అన్న కన్ ఫ్యూజన్ ఎక్కువైంది. అయితే కొద్దిరోజులుగా క్రిష్ డైరక్షన్లో అమరావతిని ఏలిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథనే ఫైనల్ చేశాడని అంటున్నారు.

అయితే సినిమాల్లోనే కాదు అన్ని విషయాల్లో ఓ పట్టింపులున్న బాలయ్య తన సినిమా ఎనౌన్స్ మెంట్ ఈరోజు ప్రకటిస్తాడని చెప్పారు. సో బాలయ్య వందో సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారన్నమాట. 99 సినిమాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని వందో సినిమాకు చేరుకున్న బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా వందో సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు.

గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుం, కంచె లాంటి విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాలో బాలయ్య బాబుని ఎవరు ఊహించని విధంగా చూపించనున్నాడని టాక్. ఇక బాలయ్య తన ఎనౌన్స్ మెంట్ లో భాగంగా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అన్నది కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close