అనిల్ రావిపూడిని ప‌క్క‌న పెట్టి పూరితో?!

నంద‌మూరి బాల‌కృష్ణ ఎప్పుడూ లేనంత‌గా బిజీ ఇప్పుడు. ఆరుగురు నిర్మాత‌లు బాల‌య్య‌కు అడ్వాన్సులు ఇచ్చారు. మ‌రో ఆరుగురు వెయిటింగ్. సినిమా త‌ర‌వాత సినిమాని, వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. `అఖండ‌` అవ్వ‌గానే గోపీచంద్ మ‌లినేనితో సినిమా ఉంటుంది. ఆ త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా. కాక‌పోతే.. ఇప్పుడు బాల‌య్య ఆలోచ‌న మారింది. గోపీచంద్ మ‌లినేని సినిమా అవ్వ‌గానే పూరితో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. పైసా వ‌సూల్ త‌ర‌వాత బాల‌య్య‌తో మ‌రో సినిమా చేయాల‌ని పూరి.. పూరికి మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌ని బాల‌య్య ఫిక్స‌య్యారు. ఇప్పుడు ఇది వ‌ర్క‌వుట్ అయ్యింది. `పూరితో ఓ సినిమా చేస్తున్నా` అని బాల‌య్య కూడా ఈమ‌ధ్య ప్ర‌క‌టించారు. నిజానికి పూరి ఛాన్స్ రావ‌డానికి చాలా టైమ్ ప‌ట్టాలి. కానీ.. బాల‌య్య అనిల్ రావిపూడిని సైతం ప‌క్క‌న పెట్టి, పూరితో సినిమా చేయాల‌ని ఉత్సాహం చూపిస్తున్నాడు. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయినా… రావిపూడి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థ వినిపించ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు పూరి క‌థ‌ల విష‌యంలో చాలా స్పీడు. ఒక రోజులోనే క‌థ సిద్ధం చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. బాల‌య్య కోసం పూరి ద‌గ్గ‌ర లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే రావిపూడి కంటే పూరికే ముందు ఛాన్స్ ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అన్నీ కుదిరితే.. 2022లోనే ఈ కాంబో చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close