‘సైరా’ సెట్‌లో బాల‌య్య‌

‘సైరా’ సెట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగు పెట్టాడ‌ని ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నిజానికి ఆ ఫొటో చాలా పాత‌ది. అమితాబ్ బ‌చ్చ‌న్ ‘సైరా’ షూటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు ఆయ‌న్ని క‌లుసుకోవ‌డానికి `సైరా` సెట్‌కి వెళ్లాడు ప‌వ‌న్‌. అప్ప‌టి ఫొటోనే ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈమ‌ధ్య కాలంలో.. ‘సైరా’ సెట్లో ఓ హీరో అడుగుపెట్టాడు. ఆయ‌నెవ‌రో కాదు. నంద‌మూరి బాల‌కృష్ణ‌. చిరంజీవి – బాల‌య్య‌ల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ‘ప‌రిశ్ర‌మ‌లో నేను చ‌నువుగా ఉండే హీరో చిరునే’ అని బాల‌య్య కూడా ఓ సంద‌ర్భంలో చెప్పాడు. ఆ మాట మ‌రోసారి నిజమైంది. ఇటీవ‌ల ‘సైరా’ షూటింగ్ స్పాట్‌కి బాల‌కృష్ణ వెళ్లారు. కాసేపు చిరుతో, టీమ్‌తో మాట్లాడి వ‌చ్చారు. అయితే ఆ ఫొటోలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. త్వ‌ర‌లో వ‌స్తాయేమో చూడాలి. ‘బాహుబ‌లి’ త‌ర‌వాత అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం `సైరా`. చిత్ర‌బృందం కూడా ‘బాహుబ‌లి’ని టార్గెట్ చేసుకునే `సైరా`ని రూపొందిస్తోంది. అందుకే చిత్ర ప‌రిశ్ర‌మ‌ల కూడా ఈ సినిమాపై ప్ర‌త్యేకమైన ఫోక‌స్ పెట్టింది. ‘సైరా’ సెట్లో ఏం జ‌రుగుతుందా? అనే ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తోంది. త్వ‌ర‌లోనే రాజ‌మౌళి కూడా `సైరా` సెట్‌కి వెళ్తార‌ని టాక్‌. అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రో షెడ్యూలు కోసం హైద‌రాబాద్ వ‌స్తారు. ఆ స‌మ‌యంలో.. సెల‌బ్రెటీల రాక మ‌రింత ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com