కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడితో… బాలయ్య‌?

కంచ‌ర‌పాలెంతో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా. ఆ త‌ర‌వాత ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌శ్య తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాల త‌ర‌వాత న‌టుడిగా బిజీ అయ్యాడు. మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఓ క‌థ రెడీ చేశాడు. ఇటీవ‌ల బాల‌య్య‌కు క‌లిసి క‌థ మొత్తం చెప్పేశాడు వెంక‌టేష్‌. బాల‌య్య‌కు కూడా ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని స‌మాచారం. బాల‌య్య చిన్న చిన్న మార్పులు సూచించాడ‌ని, ప్ర‌స్తుతం మార్పులు – చేర్పుల‌తో వెంక‌టేష్ బిజీగా ఉన్నాడ‌ని టాక్‌.

కంచ‌ర‌పాలెంలా.. ఇది కూడా ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థేన‌ట‌. బాల‌య్య ఈ సినిమాని ప్ర‌యోగాత్మ‌కంగానే చేయాల‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం. బాల‌య్య కెరీర్‌లో ఇదో కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్ అవుతుంద‌ని మ‌హా గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఆ వెంట‌నే… అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఆ త‌ర‌వాతే… వెంక‌టేష్ మ‌హా క‌థ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాని 3 – 4 నెల‌ల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట వెంక‌టేష్‌. అందుకే ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా – వెంక‌టేష్ సినిమా ప‌ట్టాలెక్కేసే ఛాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close