ఎన్టీఆర్ బ‌యోపిక్‌: ఆ బిగ్ స‌ర్‌ప్రైజ్ ఏమిటి?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా ప‌క‌డ్బందీగా సాగుతున్నాయి. `ఎన్టీఆర్`గా బాల‌కృష్ణ లుక్ త‌ర‌వాత‌… చంద్ర‌బాబు (రానా), ఏఎన్నార్ (సుమంత్‌) లుక్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అప్పుడ‌ప్పుడూ సంద‌ర్భం చూసుకుని బాల‌య్య లుక్స్‌ని బ‌య‌ట‌కు తీసుకొస్తున్నారు. గురువారం ఎన్టీఆర్ టీమ్ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రాబోతోంది. ఉద‌యం 9.35ల‌కు ఎన్టీఆర్ టీమ్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న రాబోతోంది. అదేమిట‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ సినిమాని రెండు భాగాలుగా చూపిస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి ఓ భాగం, మ‌రో ప‌ది హేను రోజుల విరామంలో పార్ట్ 2 విడుద‌ల చేస్తార‌ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే వార్త‌ని అధికారికంగా ప్ర‌క‌టించే ఛాన్సుంది. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని తొలి భాగంలోనూ, రాజ‌కీయ జీవితాన్ని రెండో భాగంలోనూ చూపిస్తారు. ఇది ఓ విధంగా మంచి మార్కెటింగ్ స్ట్రాట‌జీ కూడా. రెండు సినిమాల్నీ ప‌ది హేను రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌ల చేయ‌డం కూడా…. ఓ సాహ‌స‌మే. ఓర‌కంగా చెప్పాలంటే.. తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఇదో కొత్త ఆలోచ‌న‌. ఎన్టీఆర్‌బృందం కూడా ఇదే న్యూస్‌ని బ‌య‌ట పెట్ట‌బోతోందా? లేదంటే ఇంకాస్త పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతోందా? అనేది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close