పైసా వ‌సూల్ : ఆఫ‌ర్లు అదిరిపోతున్నాయ్‌

పూరి.. ఎన్ని ఫ్లాపులిచ్చినా త‌న‌కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గ‌ని డైరెక్ట‌ర్‌. లోఫ‌ర్‌, ఇజం, జ్యోతిల‌క్ష్మి.. ఇలా ఫ్లాపుల మీద ఫ్లాపులు కొట్టాడు. కానీ… పూరి సినిమా అంటే మ‌ళ్లీ అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. పూరి – బాల‌య్య కాంబినేష‌న్ అన‌గానే…. ”ఈ సినిమా జ‌రుగ్గుద్దా” అని పెద‌వి విరిచిన వాళ్లే.. ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌కి ఏర్ప‌డుతున్న క్రేజ్ చూసి ముక్కున వేలేసుకొంటున్నారు. ‘పైసా వ‌సూల్‌’ ఈ ద‌స‌రా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ లుక్కుల‌తో ప‌రిపెట్టిన పైసా వ‌సూల్‌.. ఇప్పుడు టీజ‌ర్‌ని అందించే ప‌నిలో ప‌డింది. ఈ నెల 28న టీజ‌ర్‌ని వ‌ద‌ల‌బోతున్నారు. పూరి డైలాగులు బాల‌య్య నోటి నుంచి విందామ‌ని… ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు ట్రేడ్ వ‌ర్గం కూడా… పైసా వ‌సూల్ టీజ‌ర్‌పై క‌న్నేసింది. ఈ సినిమాకున్న హైప్ దృష్ట్యా ఓపెనింగ్స్ అదిరిపోవ‌డం ఖాయం. సినిమా బాగుంటే… ద‌స‌రా సీజ‌న్ కాబ‌ట్టి వ‌సూళ్ల దుమ్ము లేచిపోతుంది. అందుకే… బ‌య్య‌ర్లు ఈ సినిమా కొన‌డానికి పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా చోట్ల నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్లు అందాయి. కానీ నిర్మాత మాత్రం ఈ సినిమాని అప్పుడే అమ్మే ఉద్దేశం లేద‌న్న‌ట్టు ఎవ్వ‌రికీ మాట ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తుంది. టీజ‌ర్ వ‌చ్చాక‌…. ఈ సినిమా ద‌మ్మెంటో తెలుస్తుంద‌ని, అప్పుడు అడిగినంత ఇవ్వ‌డానికి బ‌య్య‌ర్లు సిద్దం అవుతార‌ని నిర్మాత భావిస్తున్నారు. మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాథ్ మార్కెట్ స్ట్రాట‌జీ వేరు. త‌న ప్ర‌తి సినిమాకీ కావల్సినంత హైప్ సృష్టించుకోగ‌ల‌డు. అందుకే.. మంచి రేట్లు వ‌చ్చే వ‌ర‌కూ కంగారు ప‌డొద్ద‌ని నిర్మాత‌కు చెప్పేశాడ‌ట‌. సో.. పైసా వ‌సూల్ భారీగా పైసలు వ‌సూళ్లు చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింద‌న్న‌మాట‌. చూద్దాం.. టీజ‌ర్‌తో అంచ‌నాలు పెరుగుతాయో… తారు మారు అవుతాయో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.