బాల‌య్య ఒక‌రా.. ఇద్ద‌రా??

ద్విపాత్రాభిన‌యం అంటే భ‌లే మోజు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు. బ‌హుశా.. అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కుల్లో ఎక్కువ ద్విపాత్రాభిన‌యాలు చేసిన క‌థానాయ‌కుడు బాల‌య్యేనేమో. అందులో దాదాపుగా అన్నీ హిట్సే. ఇప్పుడు వందో సినిమాలోనూ బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లోనే క‌నిపిస్తార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని ఉగాది రోజున లాంఛ‌నంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌య్య టైటిల్ రోల్‌లో క‌నిపిస్తారు. అయితే… ఈసినిమాలో ఆయ‌న‌ది డ్యూయెల్ రోల్ అనితెలుస్తోంది. మ‌రి రెండో పాత్ర ఏమిటి?

దాన్ని ఎలా తీర్చిదిద్దుతారు అన్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. ప్ర‌జెంట్‌.. ఫ్లాష్ బ్యాక్ అంటూ.. చారిత్ర‌క గాథ‌ని సోష‌ల్ డ్రామాతో క‌లిపి చెబుతారా? లేదంటే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చ‌రిత్ర‌లో ఉన్న మ‌రో కీల‌కమైన పాత్ర‌లోనూ బాల‌కృష్ణే క‌నిపిస్తారా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంలో అతి త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది. ఈనెల 22న ఈ చిత్రం క్లాప్ కొట్టుకోనుంది. మే చివ‌రి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close