బాల‌య్య హీరో, రాజ‌శేఖ‌ర్ విల‌న్‌…

ఓ వేదిక‌పై ఇద్ద‌రు హీరోలు క‌నిపిస్తే… పండ‌గే పండగ‌. అదే.. హీరోలు వెండితెర‌పై ద‌ర్శ‌న‌మిస్తే.. ఇక చెప్పేదేముంది? ఇద్ద‌రు హీరోలు ఓ ఆడియో పండక్కి వ‌స్తే.. వాళ్లిద్ద‌రూ క‌ల‌సి న‌టిస్తే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది. గ‌రుడ వేగ ట్రైల‌ర్ లాంచ్ చూసినా అదే ఫీలింగ్ వ‌స్తుంది. రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ట్రైల‌ర్ లాంచ్ కి నంద‌మూరి బాల‌కృష్ణ అతిథిగా విచ్చేశాడు. బాల‌య్య స్పీచ్ అంటే చెప్పేదేముంది? బోల్డంత ఫ‌న్ ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ ఈసారి రాజ‌శేఖ‌ర్ తీసుకొన్నాడు. బాల‌య్య‌ని ‘సార్‌.. సార్‌’ అంటూ.. పిల‌వ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకొంది. ఓ సంద‌ర్భంలో ‘బాల‌య్య అంత స్పీడుగా నేను చేయలేను’ అని కాంప్లిమెంట్ ఇవ్వ‌డం కూడా స‌భికుల‌కు న‌చ్చింది. ‘మేమిద్దరం ఓ సినిమా చేస్తున్నాం.. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు.. బాల‌య్య హీరో, నాది సైడ్ క్యారెక్ట‌ర్‌, విల‌న్ అనుకోండి’ అన్నాడు రాజ‌శేఖ‌ర్‌.

దాంతో బాల‌య్య కూడా న‌వ్వేశాడు. రాజ‌శేఖ‌ర్ న‌వ్వులాట‌గా అన్నా… కాంబినేష‌న్ అయితే అదిరిపోయింది. వేదిక‌పై బాల‌య్య‌, రాజ‌శేఖ‌ర్‌ల మ‌ధ్య క‌నిపించిన స్నేహ‌త‌త్వం.. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేష‌న్ సెట్ అయితే అవుతుంది, లేదంటే లేదు, ఇద్ద‌రు సీనియ‌ర్ న‌టుల మ‌ధ్య ఉన్న ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి అద్దం ప‌ట్టిన‌ట్టైంది. ఏమో… బాల‌య్య అనుకొంటే ఏదైనా సాధ్య‌మే. త‌న సినిమాలో విల‌న్ గా రాజ‌శేఖ‌ర్‌ని ఎంచుకొన్నా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌శేఖ‌ర్ మాట‌ల‌కు అంత బ‌ల‌ముందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close