బాల‌య్య‌ను ప‌ట్టేశాడుగా!

పూరి ద‌గ్గ‌ర ఓ మ్యాజిక్ ఉంది. త‌ను ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు కూడా.. హిట్ హీరోల్ని ఒప్పించ‌గ‌ల‌డు. క‌థల్లో, ప‌నితీరులో ప‌దును త‌గ్గింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా – స్టార్ల‌తో సినిమాలు చేయ‌గ‌ల‌డు. అదేంటో గానీ, త‌న‌తో ఒక్క‌సారి ప‌నిచేస్తే… వెంట‌నే ప్రేమ‌లో ప‌డిపోతారు. పూరి కూడా త‌న హీరోని ఆస్థాయిలో ప్రేమించేస్తాడు. సినిమా చేస్తున్నంత సేపూ… స‌ద‌రు హీరోకి అభిమానిగా మారిపోతాడు. ప్ర‌స్తుతం పూరి… నంద‌మూరి బాల‌కృష్ణ ప్రేమ‌లో ఉన్నాడు. ఇద్ద‌రి కాంబినేష‌న్లో ‘పైసా వ‌సూల్‌’ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ముందు పూరీకీ బాల‌య్య‌కు మ‌ధ్య‌గా పెద్ద‌గా సంబంధాలేం లేవు. ‘హాయ్‌..’ అంటే ‘హాయ్‌’ అనుకోవ‌డం అంతే. ఇద్ద‌రూ క‌ల‌సి ప‌నిచేద్దాం అని కూర్చున్న దాఖ‌లాలూ లేవు. అనుకోకుండా ‘పైసా వ‌సూల్‌’ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిపోయింది.

షూటింగ్ మొద‌లైందో లేదో ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఓ హీరో – ద‌ర్శ‌కుడు మింగిల్ అయిపోతే ఆ రిజ‌ల్ట్ వేరేలా ఉంటుంది. అది.. ‘పైసా వ‌సూల్‌’లో క‌నిపించింద‌ని స‌మాచారం. బాల‌య్య ని స‌రికొత్త‌గా చూపించ‌డంలో పూరి స‌ఫ‌లీకృతుడ‌య్యాడ‌ని ర‌షెష్ చూసిన‌వాళ్లు చెబుతున్నారు. బాలయ్య కూడా పూరి స్టైల్‌కి ప‌డిపోయాడ‌ట‌. ‘బాల‌య్య‌ని అభిమానులు ఎందుకు ఇంతగా అభిమానిస్తారో నాకు అర్థ‌మైంది. నేనూ బాల‌య్య‌కు అభిమానిగా మారిపోయా. జూబ్లీ హిల్స్ లో బాల‌య్య అభిమాన సంఘం పెడితే.. నేనే అధ్య‌క్షుడ్ని’ అంటూ బాల‌య్య‌పై పూరి త‌న అభిమానాన్ని కురిపించేస్తున్నాడు. ‘పైసా వ‌సూల్‌’ రిజ‌ల్ట్ ఏమైనా స‌రే… వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రావ‌డం ఖాయ‌మ‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. పూరి అంత‌లా ప‌డ‌గొట్టేశాడు బాల‌య్య‌ని. పూరినా మజాకా..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close