ఢిల్లీ నుంచి కేసీఆర్ రాక.. బండి సంజయ్ పోక..! అయితే నిజమేనా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకోగానే.. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. మోడీని పొగుడుతూ లేఖ రాసిన మరుసటి రోజే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అలా ఢిల్లీ వెళ్లడం ఆలస్యం.. ఇలా మోడీ సహా అగ్రనేతలందరి అపాయింట్‌మెంట్లు క్షణాల్లో లభించాయి. అందరితోనూ ఆయన రెండు రోజుల పాటు చర్చలు జరిపి తిరిగి వచ్చేశారు. ఏం చర్చించారో అన్నది బయటకు చెప్పలేదు. చెప్పరు కూడా. జరిగే పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే. అది కేసీఆర్ స్టైల్. అయితే… అందరికీ ఒక్క విషయం మాత్రం స్పష్టత వచ్చింది.. అదేమిటంటే.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ ఎజెండాతోనే సాగిందని.

దానికి తగ్గట్లుగా ఆయన ఢిల్లీ పర్యటన ముగియనే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనను హైకమాండ్ పెద్దలే పిలిపించారని.. కేసీఆర్ పెట్టిన ప్రతిపానలపై చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌లో మేయరం పీఠం బీజేపీకి ఇచ్చి.. డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ తీసుకుంటుందనే ప్రతిపాదనను కేసీఆర్ పెట్టారని…చెబుతున్నారు. అయితే.. ఇప్పుడుగ్రేటర్ పీఠం తీసుకుంటే ఇక టీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాలుగా ముద్రపడతాయని అప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగాలనుకుంటున్న బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. గ్రేటర్ లో ఎలాంటి పదవులు రాకపోయినా… టీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధాలు వద్దని వారు కోరుకుంటున్నారు.

అయితే జాతీయ రాజకీయ అవసరాల కోసమో.. మరో విధమైన రాజకీయ వ్యూహం ఉందో కానీ.. మొత్తానికి కేసీఆర్ ప్రతిపాదనలపై ఓ కదలిక అయితే మాత్రం వచ్చిందని.. బండి సంజయ్ ఢిల్లీ పర్యటనతోనే క్లారిటీ వచ్చిందన్న చర్చ మాత్రం ప్రారంభమయింది. మొత్తానికి కేసీఆర్ … ఇటీవలి కాలంలో వెనుకబడినట్లుగా చర్చ జరుగుతోంది కానీ.. తాను అనుకుంటే రాజకీయాల్ని మలుపు తిప్పగలనని మరోసారి నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close