బంగార్రాజు.. వ‌దిలేసిన‌ట్టేనా?

‘సోగ్గాడే చిన్ని నాయ‌న‌’… నాగార్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమా ఇది. కల్యాణ్ కృష్ణ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. త‌న ప‌నిత‌నానికి నాగ్ ఖుష్ అయి, నాగ చైత‌న్య‌ని సైతం త‌న చేతుల్లో పెట్టాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే తీయ‌గ‌లిగాడు క‌ల్యాణ్‌. అంత‌కు ముందు నుంచీ.. ‘సోగ్గాడే..’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ వ‌స్తుంద‌ని ప్ర‌చారం సాగింది. అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా క‌ల్యాణ్ రెడీ చేసి పెట్టాడు. నాగ్ ప‌లుమార్లు మార్పులు చేర్పులూ సూచించ‌డం, దానికి క‌ల్యాణ్ రిపేర్లు చేయ‌డం.. ఇదీ ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న తంతు. ఈలోగా నాగ్ మూడు నాలుగు సినిమాలు చేసేశాడు కూడా. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు క‌థ‌కి ఓకే చెప్పాడు. దాంతో… క‌ల్యాణ్ ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయి.

బంగార్రాజు చేస్తాన‌ని చెప్ప‌డు, అలాగ‌ని చేయ‌ను అని కూడా చెప్ప‌క‌పోవ‌డంతో క‌ల్యాణ్ డైలామాలో ప‌డ్డాడు. అయితే.. క‌ల్యాణ్ తీసిన ‘నేల టికెట్ట్‌’ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాంతో నాగ్ ‘బంగార్రాజు’ సినిమా చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నాడ‌ని టాక్‌. నాగ్ కోసం ఆగాలా? లేదంటే మ‌రో క‌థ రెడీ చేసుకుని, ఇంకో సినిమా చేసుకోవాలా? అనేది క‌ల్యాణ్‌కీ అర్థం కావ‌డం లేదు. అయితే తాజా ప‌రిణామాల్ని చూస్తే బంగార్రాజు చేయ‌డానికి నాగ్ ఆస‌క్తి చూపించ‌డం లేద‌నే అనిపిస్తోంది. ఎన్ని సార్లు మార్పులు చేసుకుని వ‌చ్చినా, నాగ్‌ని మెప్పించ‌లేక‌పోతున్నాడ‌ట క‌ల్యాణ్‌. దాంతో.. ఈ సినిమాని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని స‌మాచారం. ఇప్పుడు క‌ల్యాణ్ మ‌రో హీరోని వెదుక్కోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close