ఇ.ఎమ్.ఐ.లు మూడు నెల‌లు చెల్లించ‌క్క‌ర్లేదు.. కానీ..?

దేశ‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ప్ర‌జా ప్ర‌యోజ‌న చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇ.ఎమ్.ఐ.ల‌పై మూడు నెల‌ల‌పాటు మార‌టోరియం విధించింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణ‌యం వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే, ఇది వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్టా అంటే… కాద‌నే చెప్పాలి. ఎందుకంటే, దీనిపై బ్యాంకులు ప్ర‌క‌ట‌న చెయ్యాల్సి ఉంటుంది. బ్యాంకులు ఆమోదం తెలిపితేనే వినియోగదారుల‌కు ఈ సౌక‌ర్యం వ‌ర్తిస్తుంది. ఆర్.బి.ఐ. ప్ర‌క‌టించిన మార‌టోరియంపై బ్యాంకుల‌న్నీ స‌మావేశమై చ‌ర్చించుకోవాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ బ్యాంకుల నుంచి ఈ నిర్ణ‌యం అమ‌లుపై ఎలాంటి ప్ర‌క‌ట‌నలూ విడుద‌ల కాలేదు.

ఆర్.బి.ఐ. నిర్ణ‌యంపై చాలామందిలో అనుమానాలున్నాయి. మూడు నెల‌ల ఇ.ఎమ్.ఐ. ర‌ద్దు అయిపోయిన‌ట్టే అని కొంత‌మంది భావిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. ఇది అవాస్త‌వం. మూడు నెల‌లపాటు వాయిదా మాత్ర‌మే ఇది! అంటే, లోన్లు తీసుకున్న‌వారి చెల్లింపు ప‌రిమితి ఓర‌కంగా మ‌రో మూడు నెల‌లు పెరిగిన‌ట్ట‌యింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ఖాతాల్లో న‌గ‌దు వెసులుబాటు కోసం మాత్ర‌మే ఈ నిర్ణ‌యాన్ని ఆర్.బి.ఐ. తీసుకుంది. తాజా నిర్ణ‌యాన్ని బ్యాంకులు అమ‌ల్లోకి తీసుకొస్తే… ప‌ర్స‌న‌ల్, ఎడ్యుకేషన్, హోమ్, వెహిక‌ల్ లోన్లకు ఈ మూడు నెల‌ల ఇ.ఎమ్.ఐ. వాయిదా ప‌డుతుంది. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని కొనుక్కున్న వ‌స్తువులకు కూడా ఇది వర్తిస్తుంది.

క్రెడిట్ కార్డుల ఈ నిర్ణ‌యానికి మిన‌హా అని నిపుణులు చెబుతున్నారు. అంటే, క్రెడిట్ కార్డు కొనుగోళ్లు చేసి… వాటిని ఇ.ఎమ్.ఐ.లు క‌న్వ‌ర్ట్ చేసుకున్న‌వారు య‌థాత‌థంగా చెల్లించాల్సిన ఉంటుంద‌ని అంటున్నారు. అయితే, ఆయా బ్యాంకులు దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తే, మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆర్బీఐ నిర్ణ‌యం చాలామందికి కొంత ఊర‌ట క‌లిగించేదే. ఎందుకంటే, లాక్ డౌన్ స‌మ‌యంలో కార్యాల‌యాలు మూసేసిన‌వారికి రాబోయే నెల జీతాల ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే ఆందోళ‌న కొంత‌మంది ప్రైవేటు ఉద్యోగుల్లో ఉంది. పైగా మూడు వారాల లాక్ డౌన్ అంటున్నారు కాబ‌ట్టి, ఎలా ఉంటుందో చూడాలి. ఇదోక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కాబ‌ట్టి, ప్ర‌భుత్వంతోపాటు ప్రైవేటు సంస్థ‌లూ కొంత ఉదారంగానే వ్య‌వ‌హరిస్తాయ‌ని భావించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close