మీడియా వాచ్ : టీవీ9కి మూడు నెలల్లో మూడో సీఈవో..!

సుప్రసిద్ధ మీడియా కంపెనీ… తెలుగు గడ్డపై ఆవిర్భవించి… ఉత్తరాదిలో సైతం.. తన ముద్రను బలంగా చాటిన టీవీ9 గ్రూపు… రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత.. క్రమంగా.. రూపు మార్చుకుంటోంది. ఓ జర్నలిస్టు నడిపే వ్యవస్థకు… ఓ రియల్ ఎస్టేట్ నడిపే వ్యవస్థకు ఎలాంటి తేడా ఉంటుందో.. స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంగా.. గట్టిగా మూడు నెలలు కాక ముందే సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. వ్యవస్థాపక .. సీఈవో.. రవిప్రకాష్ ఊస్టింగ్ కు గురై.. కేసుల పాలయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన సీఈవోను.. రెండు నెలల్లోనే.. .. ఇంటికి పంపేశారు. ఇప్పుడు.. కొత్తగా బరున్ దాస్ అనే ఎగ్జిక్యూటివ్‌ను సీఈవోను చేర్చుకున్నారు.

టీవీ9 గ్రూపుకి కొత్త సీఈవోగా బరున్ దాస్‌ను నియమించారు. బరున్ దాస్ గతంలో జీ గ్రూపులో పని చేశారు. కపిల్ సిబల్‌కు చెందిన తిరంగా టీవీకి ఒక్క రోజు సీఈవోగా వ్వహరించారు. ఇప్పుడు.. టీవీ9 గ్రూపులో చేరారు. రవిప్రకాష్ తర్వాత సీఈవోగా… నియమించిన మహేందర్ మిశ్రా విషయంలో ఏం జరిగిందన్న చర్చ సహజంగానే మీడియా వర్గాల్లో ప్రారంభమయింది. టీవీ9 రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత రెండు నెలలు పాటు సీఈవోగా ఉన్నారు. ఈ రెండు నెలల్లోనే ఆయనకు పూర్తి స్థాయిలో జీవితంపై విరక్తి పొందారు. ఎంతగా కొత్త యాజమాన్యం వేధించింది అంటే… కన్నడ చానల్ సీఈవోని నెంబర్ వన్ గా నిలబెట్టినందుకు… సంస్థలో.. అత్యంత కీలకంగా ఉన్నందుకు.. ఒప్పందం ప్రకారం.. లాభాల్లో వాటాగా తనకు రావాల్సిన రూ. 8 కోట్ల 70 లక్షలను.. రియల్ ఎస్టేట్ యాజమాన్యం… ఇవ్వడానికి నిరాకరిస్తోందట. వీటిని ఎగ్గొట్టడానికే ఆయనను బలవంతంగా బయటకు పంపేసిందట. ఈ విషయాన్నే మహేందర్ మిశ్రా ఎడిటర్స్ గిల్డ్ కు లేఖ ద్వారా తెలియచేసి ఆవేదన వ్యక్తం చేశారు.

రవిప్రకాష్ నేతృత్వంలో టీవీ9 ఉన్నప్పుడు.. నాయకత్వ లక్షణాలను గుర్తించి.. వారికి చానళ్లను అప్పగించారు. మహేందర్ మిశ్రా.. ఓ సాధారణ జర్నలిస్టు మాత్రమే. ఆయనలో నాయకత్వ లక్షణాలను గుర్తించి.. కన్నడ చానల్ లాంచింగ్ సమయంలో.. బాధ్యతలు ఇచ్చారు. ఇలా.. టీవీ9 వ్యవస్థలో.. అన్ని చానళ్లలోనూ సమర్థులైన వారినే.. ఎంపిక చేశారు రవిప్రకాష్. వారి కష్టానికి తగ్గట్లుగా.. లాభాల్లో వాటాను ఆఫర్ చేశారు. ఇప్పుడు వారందర్నీ సంస్థ యాజమాన్యం బయటకు పంపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close