‘బీఫ్‌’పై ఉడుకుతున్న ఉస్మానియా

హైదరాబాద్: దేశాన్ని కుదిపేసిన బీఫ్ అంశం ఇప్పుడు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరింది. ఈనెల 10న ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని దళిత, బహుజన, మైనార్టీ, వామపక్షాలకు చెందిన 26 విద్యార్థి సంఘాలు ప్రకటించగా, దానిని అడ్డుకుంటామని బీజేపీ, జనజాగృతి సంస్థ తదితర సంఘ్ పరివార్ సంస్థలు హెచ్చరించాయి. దీనితో ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది.

విద్యార్థులలో బీఫ్ వివాదంపై అవగాహన పెంచేందుకే తాము ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నామని విద్యార్థిసంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూ మతోన్మాద శక్తుల పెత్తనానికి నిరసనగా దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 5న అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ నిర్వహిస్తామని, 7వ తేదీన నెక్లెస్ రోడ్‌లో 5కే రన్ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు వ్యతిరేకించినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని, బీజేపీ మినహా అన్ని పార్టీలూ తమకు మద్దతు ఇచ్చాయని చెబుతున్నారు. ఎవరైనా దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని అంటూనే ప్రభుత్వమే తమకు రక్షణ కల్పించాలని కూడా కోరారు.

మరోవైపు ఉస్మానియాలో తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు హిందూత్వ వాదులంతా సిద్ధంగా ఉండాలని, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు డిసెంబర్ 10న నిర్వహించే చలో ఉస్మానియా కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామంటూ బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. బీఫ్ ఫెస్టివల్‌ను ఆపాలని యూనివర్సిటీ అధికారులకు, సచివాలయంలోని ప్రభుత్వాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించటమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతామని చెప్పారు.

ఇరువర్గాలూ తమ తమ వాదనపై పట్టుపట్టుకుని కూర్చుని ఉండటంతో 10వ తేదీన ఏం జరుగుతుందోనని ఉస్మానియా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పోలీసులు ముందు జాగ్రత్తగా క్యాంపస్‌లో, పరిసరాల్లో బందోబస్తును పటిష్ఠం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close