అతిగా ఆశపడిన బీజేపీ..! కర్ణాటకలో పరువు పోగొట్టుకుంది..!!

మంత్రి పదవులు, వందల కోట్లయినా ఇచ్చి… ప్రభుత్వాన్ని కాపాడుకుందామనుకున్న బీజేపీ చివరి క్షణంలో వెనక్కి తగ్గింది. తమ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటు… బీజేపీ పరువు పోయేలా బేరసారాల ఆడియోలు బయటకు రావడంతో.. గెలిచినా… ఆ చెడ్డ పేరు పార్టీని దేశమొత్తం వెంటాడుతుందని.. తేలిపోియంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాదిన కర్ణాటకలో అడుగుపెట్టాలనుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చివరి క్షణంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఉదయం అసెంబ్లీలో పరిణామాలు కూడా.. బీజేపీకి మెజార్టీ వచ్చేలా కనిపించలేదు. బలపరీక్ష జరిగినా పరువు పోయే పరిస్థితి ఉండటంతో.. వాజ్ పేయి ఫార్ములాను ఫాలో అయి… ఎంతో కొంత పరువు నిలబెట్టుకోవాలనుకుంది. దాని ప్రకారం వెంటనే కేంద్రమంత్రి అనంతకుమార్.. అసెంబ్లీకి వచ్చి ప్రధాని సందేశాన్ని యడ్యూరప్పకు చేరవేశారు. ఆ తర్వాత యడ్యూరప్ప కూడా అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామా చేయమని అమిత్ షా కూడా సూచించడంతో యడ్యూరప్ప లేఖ రెడీ చేసుకున్నారు.

గతంలో వాజ్ పేయి కూడా బలం లేకపోయనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విశ్వాస పరీక్ష సమయంలో భావోద్వేగంతో ప్రసంగించి.. ఆ తర్వాత నేరుగా రాజ్‌భవన్ కు వెళ్లి రాజీనామా చేశారు. అధికారం చేతుల్లో ఉన్నా.. ఎంపీలను కొనుగోలు చేసేందుకు వాజ్ పేయి ప్రయత్నించకపోవడంతో ఆయనకు స్టేట్స్ మెన్ గా మంచి పేరు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం.. బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి ఆడియో టేపుల్లోనూ దొరికిపోయింది. దాంతో అతిగా ఆశపడినందుకు పరువు పోవడం పక్కా అని తేలిపోవడంతో చివరికి రాజీనామాకు వెనక్కి తగ్గింది. అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పిదాలు చేసిందో.. ఈ నాలుగేళ్ల కాలంలో బీజేపీ అన్ని తప్పిందాలు చేసింది. కాంగ్రెస్ చేయలేదా అని ప్రతీ ఘటనలోనూ తనను తాను సమర్థించుకుంటూ వచ్చింది. అలా అయితే కాంగ్రెస్ కు, బీజేపీకి తేడా ఏమిటన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగింది. చివరికి కాంగ్రెస్సె బెటరన్న విధంగా బీజేపీ రాజకీయాలు నడిచాయి.

భారతీయ జనతాపార్టీపై ఇప్పటి వరకు కొంత మంది సాఫ్ట్ కార్నర్ ఉండేది. కాంగ్రెస్ అంత దుర్మార్గం కాదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడున్న బీజేపీ వాజ్ పేయి, అద్వానీల నాటిది కాదని… సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతుంది. మోదీ బీజేపీకి నైతికత, ప్రజాస్వామ్య విలువలేమీ లేవని ప్రజలు నమ్మడం ప్రారంభించారు. మూడు చిన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల్లో ఇంత వ్యతిరేక రాలేదు. కానీ ఇక్కడ గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి… అలా వచ్చిన అధికారంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడంతో… ఉన్న ఇమేజ్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్, కాంగ్రెస్ బీ టీం మాత్రమే ఉన్నాయి. అతిగా ఆశపడిన బీజేపీ.. మొత్తానికే నష్టపోయింది. ఈ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close