‘రాక్ష‌సుడు’… తీసింది కొంత, ఎత్తేసింది ఎంతో…

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా `రాక్ష‌సుడు` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ‘రాచ్చ‌స‌న్‌’ సినిమాకి ఇది రీమేక్‌. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. ఈమ‌ధ్యే టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఇంత త్వ‌ర‌గా ఈ సినిమాని ఎలా ముగించేశారా? అనే డౌటు ఎవ‌రికైనా రావొచ్చు. అస‌లు మేట‌రు ఏమిటంటే… ఈ సినిమాలో స‌గం వ‌ర‌కూ వ‌ర్జిన‌ల్ సీన్లే వాడుకున్నార‌ట‌. టీజ‌ర్లో క‌నిపించిన కొన్ని షాట్స్ మాతృక నుంచి తీసుకున్న‌వే. ‘రాచ్చ‌స‌న్‌’లో న‌టించిన న‌టీన‌టులు కొంత‌మంది ఈ రీమేక్‌లోనూ క‌నిపిస్తారు. వాళ్ల‌తో చేయాల్సిన స‌న్నివేశాల్ని మాతృక నుంచి య‌ధావిధిగా తీసుకొచ్చేశారు. బెల్లంకొండ ఉండాల్సిన సీన్లు మాత్రం మ‌ళ్లీ కొత్త‌గా తీశారంతే. సాధార‌ణంగా రీమేక్ సినిమా అన‌గానే.. ఇలా ఎత్తిపోత‌ల సౌక‌ర్యం ఉంటుంది. కాక‌పోతే… ‘రాక్ష‌సుడు’లో దాన్ని మ‌రింత ఎక్కువ‌గా వాడేసుకుంటున్నార్ట ద‌ర్శ‌కుడు. దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంది. దాంతో పాటు.. ఖ‌ర్చూ త‌గ్గుతుంది. ఐడియా బాగానే ఉంది, కాక‌పోతే… మ‌రీ త‌మిళ వాసన కొట్టేస్తుందేమో అనేదే డౌటు. మ‌రి… బెల్లంకొండ ఈసారేం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close