నవంబర్ 5న విడుద‌ల కానున్న’ బెంగాల్‌టైగ‌ర్ ‘

మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచివున్న నిర్మాణ‌సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మాత‌. రవితేజ కెరీర్లోనే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భీమ్స్ అందించిన ఆడియో ని అక్టోబర్ 17న గ్రాండ్ గా మాస్‌మ‌హారాజ్ అభిమానుల సమ‌క్షంలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా నవంబర్ 5న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ ని పూర్తిచేసాము. ముందుగా అన్నికార్క‌క్ర‌మాలు పూర్తిచేసి దసరా కానుకగా బెంగాల్ టైగర్ చిత్రాన్ని విడుదల చేయాలని భావించాం. కానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ బ్రూస్ లీ చిత్రం అక్టోబ‌ర్ 16న, అక్కినేని
వారసుడు అఖిల్ నటించిన చిత్రం అక్టోబ‌ర్ 22న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా, మా చిత్రం బెంగాల్ టైగర్ ని దీపావళి కానుకగా నవంబర్

5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో రవితేజ న‌ట‌న అందిరిని ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మ‌నందం గారి కామెడికి చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు న‌వ్వుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా భీమ్స్ పాటలందించారు. అక్టోబర్ 17న బెంగాల్ టైగల్ పాటల్ని సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close