సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 25న రానున్న ” భలే మంచి రోజు “

సుధీర్ బాబు హీరోగా కొత్త దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో 70 ఎమ్.ఎమ్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం “భలే మంచి రోజు”. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్రిస్మస్ కానుకగా 25న విడుదలకు సిద్ధమైంది. పూర్తిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సరికొత్త రీతిలో వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రానికి ” యు / ఎ ” సర్టిఫికేట్ వచ్చింది. టాలీవుడ్ లో రొటీన్ సినిమాలు ఎక్కువ అవుతున్న నేపద్యంలో “భలే మంచి రోజు” సినిమా కొత్తగా అనిపించిందని సెన్సార్ వాళ్ళు కూడా అభినందించడం విశేషం. ట్రైలర్, ఆడియో తో “భలే మంచి రోజు” సినిమా మీద జనాల్లో ఆసక్తి బాగా పెరిగింది. కొత్త తరహ సబ్జెక్టు, కొత్త కథలను ఎంచుకునే సుధీర్ బాబు, యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య, యువకులైన టీం, సూపర్ హిట్ అయిన పాటలు ఇలా అన్ని వైపుల నుండి “భలే మంచి రోజు” సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

భారి సాంకేతిక విభాగంతో రూపుదిద్దుకున్న భలే మంచి రోజు సినిమా కచ్చితంగా జనాలకి ఒక కొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని , ఈ 25న ఫ్యామిలి తో హ్యాపీ గా చూసి ఎంజాయ్ చూడదగిన సినిమా అని దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య విశ్వాసం వ్యక్తం చేసారు. సుధీర్ బాబు కెరీర్ లోనే ఎన్నడు లేని విధంగా అత్యదిక ధియేటర్లలో 25న “భలే మంచి రోజు ” సినిమాను విడుదల చేస్తున్నామని విజయ్ మరియు శశి ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close