మహేష్ , ప్రభాస్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్న ” భలే మంచి రోజు టీం “

ఈ క్రిస్మస్ కి రాబోతున్న సుధీర్ బాబు సినిమా ” భలే మంచి రోజు “. టీజర్ మొదలయిన రోజు నుండి ఆడియో విడుదల దాక అందరి మనసు దోచుకున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. . అన్ని వర్గాల నుండి ఈ సినిమా కి భారీ అంచనాలు ఉండటం తో పాటు, ట్రైలర్ మరియు పాటలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ” భలే మంచి రోజు ” సినిమా టీం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

” భలే మంచి రోజు ” ఆడియో విడుదలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు , ట్రైలర్ ని మేచ్చుకోవడమే కాకుండా యంగ్ టీం మంచి ఎనర్జీ తో పని చేసారని కితాబు ఇచ్చారు. మహేష్ బాబు ఆడియో లో ఇచ్చిన స్పీచ్ , మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఇచ్చిన సపోర్ట్ సినిమా కి బాగా కలిసి వచ్చింది. మహేష్ బాబు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ట్రైలర్ ని షేర్ చేసి గట్టి సపోర్ట్ ఇచ్చారు. మహేష్ బాబు అభిమానుల ఆదరణ కూడా భలే మంచి రోజు సినిమా మీద అంచనాలు పెరిగేలా చేయడమే కాకుండా ఈ మధ్య విడుదల అయిన ట్రైలర్ లో మేటి గా నిలవడానికి దోహద పడ్డారు.

బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా ముందు నుంచి భలే మంచి రోజు సినిమా కి సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా విషయం లో ప్రభాస్ ప్రతి విషయం లో వెన్ను తట్టి ప్రోత్సహించారు. ట్రైలర్ ని అభినందించడమే కాకుండా పాటలన్నీ విని , చాలా అద్భుతంగా ఉన్నాయని టీం ని అభినందించారు. ఈ మధ్యనే ఈ చిత్రం టీం ని కలిసి స్వయంగా సినిమా గురించి అడిగి తెలుసుకొని అభినందించారు. ప్రభాస్ ప్రోత్సాహం టీం అందరికి ఒక కొత్త్త ఎనర్జీ ని ఇచ్చిందని చెప్పాలి. సూపర్ స్టార్ , రెబెల్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ,సినిమాకి మంచి ప్రచారం వచ్చేలా కృషి చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close