బిగ్ బాస్ 2: భారీ మూల్యం చెల్లించుకున్న‌ భానుశ్రీ‌

ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి భానుశ్రీ ఎలిమినేట్ అవ్వ‌డం ఎవ్వ‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు. గ‌త వారం రోజులుగా భానుశ్రీ ప్ర‌వ‌ర్త‌న‌, త‌న మాట‌లు, చేష్ట‌లు, చెప్పిన అబ‌ద్ధాలు… ఇవ‌న్నీ బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాడు. ఎలిమినేష‌న్ భారం మోస్తున్న ముగ్గురిలో.. ఎలిమినేట్ అయ్యే ల‌క్ష‌ణాలు భానుశ్రీ‌లోనే క‌నిపించాయి. భాను.. ఎలిమినేష‌న్‌కి పూర్తిగా దారితీసిన ఘ‌ట్టం.. `మంచీ చెడు` టాస్క్‌లోనే ఎదురైంది. కౌశ‌ల్ త‌న‌ని తాక‌రాని చోట తాకాడ‌ని.. నింద‌లు వేసింది భానుశ్రీ‌. ఒక‌వేళ నిజంగా కౌశ‌ల్ తాకి ఉంటే… భానుశ్రీ ఆరోప‌ణ‌లు నిజ‌మైతే – ఆమె చేసిన గొడ‌వ‌కీ, పెట్టుకున్న క‌న్నీళ్ల‌కూ.. బిగ్ బాస్ హౌస్‌లో మ‌రిన్ని వారాలు స్ట్రాంగ్‌గా నిల‌బ‌డిపోదును. కానీ.. కౌశ‌ల్‌పై భానుశ్రీ చేసిన‌వ‌న్నీ అసత్య ఆరోప‌ణ‌లే అని తేలింది. అంతెందుకు…? త‌న గ్రూప్‌లోనే ఉన్న గీతా మాధురి కూడా భానుశ్రీ వ్య‌వ‌హారాన్ని త‌ప్పు ప‌ట్టింది. సొంత కుంప‌టిలోనే… త‌న‌కు విమ‌ర్శలు ఎదురైన‌ప్పుడు కౌశ‌ల్‌కి సారీ చెప్ప‌క త‌ప్ప‌లేదు. కేవ‌లం సానుభూతి ఓట్లు పొంది.. . ఎలిమినేష‌న్‌కి దూరం కావాల‌న్న ప‌న్నాగానికి భానుశ్రీ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వ‌చ్చింది. అయితే భానుశ్రీ వెళ్తూ వెళ్తూ… కొన్ని మంచి మాట‌లు చెప్పింది. మంచిత‌నం పేరుతో… త్యాగాల‌కు సిద్ధ‌మై, మ‌రొక‌రిని ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించొద్ద‌ని, ఎవ‌రి గేమ్ వాళ్లు ఆడితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చింది. అది నిజంగా నిజ‌మే. అతి మంచివాళ్లు అనిపించుకుంటున్న బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి ఈ మాట‌లు బాగానే తాకాయి. భానుశ్రీ చేసిన త‌ప్పు వ‌ల్ల‌.. ఎలిమినేష‌న్‌కి అతి ద‌గ్గ‌ర్లో ఉన్న గ‌ణేష్ మ‌రోసారి ఈ గండం నుంచి త‌ప్పించుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.