వ్యాక్సిన్ రేసులో అందరి కన్నా ముందున్న భారత్ బయోటెక్ ..!

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్.. ప్రపంచంలోనే మొదటి కరోనా వైరస్ వ్యాక్సిన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ రీసెర్చ్..ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్‌తో కలసి పని చేస్తోంది. కోవ్యాక్సిన్ పేరుతో.. భారత్ బయోటెక్ చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మానవులపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభఇంచారు. ఇప్పటికే ప్రయోగదశలో పన్నెండు సంస్థలకు..వ్యాక్సిన్ టెస్టింగ్ కు పంపారు.

స్వాతంత్ర దినోత్సవం నాటికల్లా..కరోనా పోరులో విజయం సాధిస్తామని ఐసీఎంఆర్ ధీమా వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ మానవ ప్రయోగదశలోకి వచ్చిందని … ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది. భారత్ బయోటెక్‌కు .. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది. ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం… రేయింబవళ్లు పని చేస్తోంది. అక్కడ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటూడటంతో..ఆగస్టు పదిహేను కల్లా.. వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనుకుంటోంది.

అలాగే అహ్మదాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న జిడస్ క్యాడిల్లా హెల్త్ కేర్ సంస్థకు కూడా..హ్యూమన్ క్లినికర్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచంలోని అనేక సంస్థలు.. వ్యాక్సిన్ కోసం.. వందలు…వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా సోకిన తర్వాత తగ్గించడానికి ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలు.. మెడిసిన్స్ ప్రవేశపెట్టాయి కానీ.. వ్యాక్సిన్ విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించలేదు. మొదటి సారి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ విషయంలో ముందడుగు వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close