ఓహో మోడీ..! ప్రణబ్ ముఖర్జీ సహా ముగ్గురికి భారతరత్న..!

రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత ప్రభుత్వం ముగ్గురికి భారతరత్న  పురస్కారాలు ప్రకటించింది. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరెస్సెస్ దివంగత ప్రముఖుడు నానాజి దేశ్ ముఖ్, ప్రముఖ కళాకారుడు భూపేన్ హజారికాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ప్రణబ్ మినహా.. ఇద్దరికీ.. మరణానంతరం పురస్కారం ప్రకటించారు. మిగతా ఇద్దరి సంగతేమో కానీ.. ప్రణబ్ ముఖర్జీకి ఇంత అర్జంట్ గా భారతరత్న ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో.. చాలా మందికి సులువుగానే అర్థమైపోతోంది. అధికారంలోకి వచ్చిన ఆరెస్సెస్ దిగ్గజాలకు.. భారతరత్న ఇచ్చిన.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. జీవితాంతం కాంగ్రెస్ వాదానికి కట్టుబడిన ప్రణబ్ ముఖర్జీకి.. భారతరత్న ప్రకటించింది.
నిస్సందేహంగా ప్రణబ్ ముఖర్జీ దిగ్గజం అనదగ్గ నేత. కానీ.. ఇంత వరకూ ఏ ఒక్కరు కూడా.. ఆయనకు..  భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం… ఆయనలో భారతరత్నని చూసింది. ఎన్నికలకు ముందుగా.. ప్రకటించేసింది.  కాంగ్రెస్ ముక్త్ భారత్ ఉంటూ.. నినాదాలు ఇస్తూ.. అదే కాంగ్రెస్ వాదాన్ని నరనరాన జీర్ణించుకున్న… ప్రణబ్ ముఖర్జీకి.. అత్యున్నత పురస్కారం ప్రకటించడం వెనుక ఉన్న నిజంగానే గౌరవమా… లేక రాజకీయమా అన్న అనుమానం రాక మానదు.  ప్రణబ్ ముఖర్జీ.. ప్రైడ్ ఆఫ్ బెంగాల్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం వెనుక ఉన్న ప్రధానమైన కోణం ఇదే. బెంగాల్ లో రాజకీయంగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ తాము చేయాల్సిందంతా చేస్తోంది. కానీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం.. అడుగు పెట్టనీయడం లేదు.
దీంతో నరేంద్రమోడీ… బెంగాల్ ప్రజలను… మరో విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఇప్పుడు.. బెంగాలీకి .. అత్యంత గౌరవం ఇచ్చానని చెబుతూ.. నరేంద్రమోడీ, అమిత్ షా.. బెంగాల్ ప్రజల్లోకి సెంటిమెంట్ రగిలించడానికి సిద్ధమవుతున్నారు. ప్రబణ్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని బెంగాల్ లో ఎన్నికలకు వెళ్తున్నారు. నానాజి దేశ్ ముఖ్ మహారాష్ట్రకు చెందిన వారు. భూపేన్ హజారికా.. అసోంకు చెందిన వారు. మహారాష్ట్రాలో శివసేన ఒంటరి పోటీకి వెళ్తూండటంతో.. అక్కడ హిందూత్వ వాదుల్లో ఆదరణ నిలుపుకోవడానికి.. పౌరసత్వ బిల్లుతో బీజేపీపై అక్కడ రేగుతున్న అసంతృప్తిని చల్లబర్చడానికి.. ఈ అవార్డులను.. మోడీ ఉపయోగిచుంకున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close