టాలీవుడ్‌లో ఏం జ‌రుగుతోంది : భ‌ర‌త్ అను నేను కూడా 26నే!

ఏప్రిల్ 27 మ్యాజిక్ చేస్తుంద‌నుకుంటే… ఇప్పుడు ఆ డేట్ మారింది. ఏప్రిల్ 26న అస‌లైన మాయ జ‌ర‌గ‌బోతోంది. నా పేరు సూర్య ఏప్రిల్ 27న వ‌స్తోంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించిన త‌ర‌వాత‌.. భ‌ర‌త్ అను నేను సినిమా కూడా అదే రోజున విడుద‌ల చేస్తామ‌న్నారు. దీంతో ఏప్రిల్ 27న మ‌హేష్, బ‌న్నీల మ‌ధ్య క్లాష్ ఏర్ప‌డింది. ఈలోగా ర‌జ‌నీకాంత్ సినిమా `కాలా`నీ అదే రోజున తీసుకొస్తామ‌న్నారు. ప‌రిస్థితి గ‌మ‌నించిన నా పేరు సూర్య టీమ్.. త‌మ సినిమాని ఒక‌రోజు ముందుకు జ‌రిపింది. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన కాసేప‌టికే మ‌హేష్ నిర్మాత‌లూ త‌మ డేట్ మార్చేశారు. ఏప్రిల్ 26నే త‌మ సినిమా కూడా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. అంటే… పోటీలో తేడా ఏంలేద‌న్న‌మాట‌. రిలీజ్ డేటే మారింది. ఇలా మ‌హేష్‌, బ‌న్నీ సినిమాలు పోటీ ప‌డి రిలీజ్ డేట్లు ప్ర‌కటిస్తుంటే ఇటు అభిమానుల్లోనూ, అటు పంపిణీదారుల్లోనూ గంద‌ర‌గోళం మొద‌లైంది. ఇలాంటి ప‌రిస్థితి టాలీవుడ్‌లో ఇంత‌కు ముందెప్పుడూ లేదు. మ‌హేష్‌, బ‌న్నీల చేతుల్లో ఏం లేక‌పోవొచ్చు. ఈ వ్య‌వ‌హారం అంతా తెర వెనుక నుంచి నిర్మాత‌లే న‌డిపించి ఉండొచ్చు. కాక‌పోతే హీరోలిద్ద‌రూ కూర్చుని మాట్లాడుకుని, ఈ గంద‌ర‌గోళానికి పుల్ స్టాప్ పెడితే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close