అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతి రెడ్డి, జగన్ బాధ్యత వహించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. వెంటనే మహిళలకు, భారతి రెడ్డి,జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి. మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించారని నేరమని.. వేశ్యల రాజధాని అనడం బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ మండిపడ్డారు. తిరుపతిలో ఈ అంశంపై మాట్లాడారు.
గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదు.. అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిదని స్పష్టం చేశారు. వేశ్యల రాజధాని అనే వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని.. ఇలాంటి మాటలు క్షమించరానివని షర్మిల స్పష్టం చేశారు. ఇది చిన్న విషయం కాదు.. ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. YCP పార్టీకి చెందిన సాక్షి చానెల్ లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌజ్ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షి మీడియా హౌజ్ నడుపున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.
భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదని.. నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారు.. మహిళల మనోభావాలు దెబ్బతీసి నందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవన్నారు.