వైఎస్ఆర్ బ‌యెపిక్‌: టైటిల్ ఏంటి? హీరో ఎవ‌రు?

టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర మొద‌లైంది. ఎన్టీఆర్‌, సావిత్రిల బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతున్నాయి. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవిత క‌థ‌నీ సినిమాగా మ‌లుస్తున్నారు. ఆనందో బ్ర‌హ్మ తో ఆక‌ట్టుకున్న మ‌హి రాఘ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ఈ చిత్రానికి `యాత్ర‌` అనే పేరు ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. రాజశేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర‌కు ప్ర‌సిద్ది. 2004 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి కార‌ణం… ఆయ‌న చేసిన పాద యాత్రే. 1,475 కిలోమీట‌ర్ల పాటు సాగిన ఆ పాద యాత్ర‌.. అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేకెత్తించింది. దానికి గుర్తుగా `యాత్ర‌` అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తారు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతుందిప్పుడు. నాగార్జున వైఎస్ఆర్‌గా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. నాగ్ కూడా `ఈ సినిమా చేయ‌డం లేదు` అని క్లారిటీ ఇచ్చాడు. మ‌మ్ముట్టి అయితే బాగుంటుంద‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డ్డారు. దానికి త‌గ్గ‌ట్టుగానే చాలా రోజుల నుంచి చిత్ర‌బృందం మ‌మ్ముట్టితో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఇప్పుడు మ‌మ్ముట్టి ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని స‌మాచారం. మ‌హి రాఘ‌వ‌
ఇప్ప‌టికే ఈ స్క్రిప్టు ప‌నులు పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల లోపు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com