బిపాషా బసుకు ముఖంపై గాయాలు

హైదరాబాద్: నటీనటులంటేనే ముఖం అందంగా కనిపించాలి. ముఖ సౌందర్యం కాపాడుకోవటం వారికి తప్పనిసరి అవసరం… అందులోనూ హీరోయిన్‌లు మరీ ముఖ్యంగా. ముఖానికేదైనా అయితే వారి కెరీర్ ముగిసిపోయినట్లే. అందుకే వారు ముఖం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు మాత్రం ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనట్లుంది. ఫలితం – ముఖంపై కాలిన గాయాలయ్యాయి.

హెయిర్ డిజైనర్ తన టాంగ్స్‌ను జారవిడవటంతో అది పడి తన ముఖంపై, మోచేతులపై కాలిన గాయాలయ్యాయని బిపాషా నిన్న ట్వీట్ చేసింది. గాయాల ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఆ హెయిర్ స్టైలిస్ట్ తనపై టాంగ్స్‌ను జారవిడిచింది కాకుండా కనీసం దానిని తీయనుకూడా తీయలేదని పేర్కొంది. ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, మచ్చలు పోవటానికి కొంత టైమ్ పడుతుందని ట్వీట్ చేసింది. బిపాషా ప్రస్తుతం టీవీకి గానూ ఒక హారర్ షో చేస్తోంది. ఆమె ఈ ఏడాది ‘ఎలోన్’ అనే ఒకే ఒక చిత్రంలో నటించింది. బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహామ్‌తో సుదీర్ఘకాలం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ నడిపిన ఆమె ప్రస్తుతం హేట్ స్టోరీ సిరీస్ చిత్రాల హీరో కరణ్ సింగ్ గ్రోవర్‌తో డేటింగ్ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close