బ‌ర్త్‌డే స్పెష‌ల్ : వెరీ వెరీ స్పెష‌ల్‌.. వెంక‌టేష్‌

క్రికెట్‌లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ని వెరీ వెరీ స్పెష‌ల్ ల‌క్ష్మ‌ణ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. త‌న సొగ‌సైన, క‌ళాత్మ‌క షాట్లు అంత‌లా ఆట్టుకొంటుంటాయి. సినిమాల్లో మ‌న వెంక‌టేష్ కూడా అలాంటి స్పెష‌ల్ న‌టుడే. సాధార‌ణంగా అగ్ర కథానాయ‌కులంతా ఓ ఇమేజ్ సంపాదించాక‌.. ప్ర‌యోగాలు చేయ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డరు. త‌మ ఇమేజ్‌కి విరుద్దంగా ఉన్న క‌థ‌ల్ని ఎంచుకోరు. త‌మ‌పై తాము సెటైర్లు వేసుకోరు. కానీ వెంకీ అలా కాదు. క‌థ న‌చ్చితే, ఆ పాత్ర త‌న‌కు స్పెష‌ల్‌గా మిగిలిపోతుంద‌నుకొంటే.. ఏమైనా చేస్తాడు.

‘ఆల్రెడీ అర ఎక‌రం పోయింది’ అంటూ త‌న పై తాను డైలాగులు వేసుకొంటాడు.
హీరోయిజం మ‌ర్చిపోయిన‌ ‘చంటి’పిల్లాడిలా మారిపోతాడు.
ప్రేమ కోసం నాలిక కోసుకొని ‘శ్రీ‌ను’లా త్యాగాలూ చేస్తాడు.
వెంకీ చేసిన ఒక పాత్ర‌కూ మ‌రో పాత్ర‌కూ ఏమాత్రం సంబంధం ఉండ‌దు. మాస్ త‌న‌కు కావాలి..క్లాసూ కావాలి. ఈలోగా ప్రయోగాలూ చేయాలి. అందుకే గ‌ణేష్‌, ప్రేమించుకొందాం రా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సుంద‌ర‌కాండ‌, చంటి… ఇలా ఏ సినిమా… మ‌రో సినిమాతో లింకు పెట్టుకోదు. అన్నిటా వైవిధ్యం… అంతటా కొత్త‌ద‌నం. అందుకే వెంకీని కుటుంబ ప్రేక్షకులు అక్కున చేర్చుకొన్నారు. అగ్ర హీరోల్లో కుటుంబ ప్రేక్ష‌కుల అండ ఎక్కువ‌గా ఉన్న‌ది ఒక్క వెంకీకి మాత్ర‌మే. చిరు, బాల‌య్య‌, నాగ్‌ల‌తో పోలిస్తే… ‘కామెడీ’ ట‌చ్ ఎక్కువ ఇచ్చేది వెంక‌టేషే. అందుకే ‘మ‌ల్లీశ్వ‌రి’, ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’ సినిమాల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌గ‌లుగుతున్నాం. వెంకీ పంచ్‌లు చూసి ఎంజాయ్ చేయ‌గ‌లుగుతున్నాం.

నిజ‌జీవితంలో వెంకీ ప్ర‌యాణం.. అత‌ని మాట‌లు ఇంకా స్పెష‌ల్‌గా ఉంటాయి. అత‌ని ఆధ్యాత్మిక చింత‌న‌, మాట‌ల్లో వేదాంతం చూస్తుంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. ”మ‌నం ప‌డుకొంటే చ‌నిపోయిన‌ట్టే లెక్క‌. మ‌ళ్లీ లేస్తామ‌న్న గ్యారెంటీ లేదు” అనే మాట‌లు వెంకీ లాంటి స్టార్ నుంచి ఊహించ‌డం సాధ్య‌మా? ”ఇదంతా జీవితం కాదు.. ఇంత‌కు మించి ఏదో ఉంది.. ముందు వాటి గురించి ఆలోచిద్దాం” అనే వేదాంతం వెంకీ వ‌ల్లిస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌గ‌ల‌మా?? ఆరోగ్యం, ధ్యానం… వీటిపై కూడా వెంకీకి బాగా గురి. రోజుకి ఎంతో కొంత వాటికి కేటాయించాల్సిందే. అందుకే పదేళ్ల క్రితం వెంక‌టేష్ ఎలా ఉన్నాడో.. ఇప్ప‌టికీ అలానే ఉన్నాడు. రీమేక్ సినిమాలంటే ఎంత‌గానో ఇష్ట‌ప‌డే వెంకీ ఇప్పుడు ‘సాలాఖ‌దూస్‌’ రీమేక్ చేస్తున్నాడు. ‘గురు’గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈసారీ త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్రే ఎంచుకొని.. మ‌రోసారి త‌న స్పెషాలిటీ చాటుకొంటున్నాడు. ‘గురు’ అనే ప‌దం సినిమా టైటిల్‌కే ప‌రిమితం కాదు. ఈత‌రానికీ వెంకీ ఓ ‘గురు’వే. క‌ల‌కాలం నిల‌వాలంటే.. మంచి న‌టుడు అనిపించుకోవాలంటే ఓ ఫార్ములాకూ, ఓ త‌ర‌హా పాత్ర‌ల‌కే కాకుండా వైవిధ్యం చూపించాల‌ని వెంకీ నేర్పాడు. గురువుగా రాబోయే త‌రానికీ మార్గ‌ద‌ర్శ‌నం చేశాడు. మ‌రి ఆ బాట‌లో న‌డిచేదెవ‌రో..? ఏదేమైనా ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకొంటున్న ‘గురు’ వెంక‌టేష్‌కి.. మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియ‌జేసుకొందాం. హ్యాపీ బ‌ర్త్ డే పెళ్లికాని ప్ర‌సాదూ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close