బెంగాల్ తర్వాత తెలంగాణలోనే బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్..!?

తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ వచ్చి చేసిన హెచ్చరికలే దీనికి కారణం. ఇప్పుడు ట్రైలరే చూపించామని.. ముందు ముందు సినిమా చూపిస్తామని అయన అంటున్నారు. బెంగాల్‌లో దీదీకి సెవన్టీ ఎంఎం సినిమా ఇప్పటికే చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు సంధి కాలంలో ఉంది. ఇప్పటి వరకూ అన్ని పార్టీల నుంచి కారులోకి వచ్చి చేరిన నేతలతో ఓవర్ లోడ్‌లో ఉంది. అవకాశాలు రాని వాళ్లు చాలా మంది ఉన్నారు. అవకాశాలు వచ్చిన వాళ్లు కూడా ప్రాధాన్యం దక్కడం లేదని.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కడం లేదన్న అభిప్రాయంతో .. మారిన రాజకీయ పరిస్థితుల్లో పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.

తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ చాలా పకడ్బందీ ప్రణాళిక పెట్టుకుంది. వారు టార్గెట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ప్రస్తుతం బెంగాల్లో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే.. బీజేపీని మించిన పార్టీ లేదు. నేతల్ని తమ పార్టీలోకి నయానో..భయానో ఆహ్వానించడంలో టీఆర్ఎస్ కూడా తక్కువేమీ కాదు. కానీ రాష్ట్రం కన్నా.. కేంద్రం అధికారం పెద్దది కాబట్టి.. టీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి. గ్రేటర్ మేయర్ పీఠం కోసం.. బీజేపీ కార్పొరేటర్లను ఆకర్షిస్తే.. అంత కన్నా పెద్ద రాజకీయ తప్పిదం ఉండదని.. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికైనా అర్థమవుతుంది. మరి కేసీఆర్ మాత్రం ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటారు..?

గ్రేటర్ మేయర్ పీఠమే టార్గెట్ అయితే.. ఉన్న కార్పొరేటర్లతోనే గెలుచుకోవడం టీఆర్ఎస్ కు చిటికెలో పని. ఎంఐఎం గైర్హాజర్ అయితే చాలు. కానీ బీజేపీ.. తమ కార్పొరేట్లను టీఆర్ఎస్ ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. ఇది కూడా బీజేపీ వ్యూహమేనని అంచనా వేస్తున్నారు. ఈ కారణం చెప్పి.. టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. బీజేపీ రాజకీయ వ్యూహాలను అంచనా వేసి.. నొప్పింపక తానొవ్వక రీతిలో ముందుకు సాగాల్సిన పరిస్థితిలో పడిపోయింది.. టీఆర్ఎస్ చూపిస్తున్న తప్పనిసరి మెదకదనం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close