పొలిటికల్ ఇన్నింగ్స్‌లో గౌతం గంభీర్ తడబాటు..!

గౌతం గంభీర్ అంటే.. దూకుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌ మన కళ్ల ముందు ఉంటారు. వ్యక్తిత్వంలోనూ అదే దూకుడు. వరుస వివాదాస్పద వ్యవహారాలతో.. క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌గా… రాజకీయాల్లోకి వచ్చారు. పాకిస్తాన్ పై.. వివాదాస్పద కామెంట్లు చేసి… రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుని బీజేపీలో చేరిపోయారు. బీజేపీ అభ్యర్థిగా ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. కానీ ఇప్పుడు.. నాకు అనుభవం లేదు… నన్ను వదిలేయండి.. అని.. విమర్శకులతో విరుచుకుపడుతున్న వారిని బతిమాలుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు.

గంభీర్‌కు ఢిల్లీలో రెండు చోట్ల ఓట్లున్నాయి. నామినేషన్ రోజే… అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. రూల్స్ తెలియకుండా గేమ్ ఆడుతున్నారని.. గంభీర్‌పై ఆప్ అభ్యర్థి సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు… విజన్‌పై బహిరంగ చర్చకు రావాలని గౌతీని డిమాండ్ చేశారు. కానీ గంభీర్ తోసిపుచ్చారు. డిబేట్లు అంటే ఇష్టం లేనప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో డిబేట్లే కీలకమనే సంగతిని… గుర్తు చేస్తున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో గంభీర్ తడబడుతున్నారు. ఆప్‌ అభ్యర్థి అతిషి విమర్శలు ఎక్కుబెడుతున్న తీరు చూస్తుంటే.. ఈ మాజీ ఓపెనర్‌కు ఎన్నికల బ్యాటింగ్ అంత తేలికేం కాదని తెలిసొస్తోంది. తాను రాజకీయాలకు కొత్త అని.. తనపై వస్తున్న విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం చేసుకోలేకపోతున్నానని.. గంభీర్.. వాపోతున్నారు.

ఢిల్లీలో… ఆమ్ ఆద్మీ పార్టీ.. పూర్తి స్థాయిలో క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. తనకు ఉన్న చాలా పరిమితమైన అధికారాలతోనే.. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను కేజ్రీవాల్ చేపట్టారు. దాంతో… ప్రజల్లో ఆప్ కు పలుకుబడి ఉంది. అదే సమయంలో.. బీజేపీపై వ్యతిరేకత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. దానికి కారణం.. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడానికి అమిత్ షా చేసిన చేరికల వ్యూహం ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. ఆ వ్యతిరేకత ఇంకా కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ.. అభ్యర్థులు.. సాధారణ నేపధ్యం ఉన్న వారు కావడం కూడా.. ప్రజల్లో కలసి పోవడానికి కారణం అవుతోంది. అదే బీజేపీ అభ్యర్థులను.. ముఖ్యంగా గంభీర్ ను కూడా టెన్షన్ పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close