జగన్ అడుగుతూనే ఉన్నారు..! వాళ్లు చెబుతూనే ఉన్నారు..!

అప్పుడెప్పుడో.. పవన్ కల్యాణ్ గురించి.. అల్లు అర్జున్‌ని అడిగితే… ” చెప్పను బ్రదర్” అనేశారు..! ఎవరు పవన్ గురించి అడిగినా ఆదే సమాధానం..!. చివరికి మనసు మార్చుకుని.. చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు.. అదే స్టైల్లో.. కాస్త టోన్ మార్చి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా… ” అడుగుతూ.. ఉంటా.. ఇచ్చేదాకా అడుగుతూ ఉంటా..” అని హోదా గురించి చెబుతున్నారు. అయితే.. ఆయన అలా అడిగిన మరుక్షణం.. ఇలా.. రిప్లయ్ ఘాటుగానే కాదు.. సూటిగా వస్తోంది.

హోదా అడగడమే కానీ.. వాళ్లేం చెబుతున్నారో పట్టించుకోరా..?

ప్రత్యేకహోదా గురించి అడుగుతానంటూ.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రకటిస్తే.. వెంటనే కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వారు ఎవరో ఒకరు.. రియాక్షన్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తిరుపతికి వచ్చిన పీయూష్ గోయల్… ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పక్కన ఉండగానే… ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని… గత ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఇచ్చిన ప్యాకేజీతో సర్దుకోవాలని నేరుగా చెప్పారు. అయితే.. దీన్ని మంత్రి పట్టించుకోలేదు సరికదా… మా విధానం అడగడమే కానీ.. వారు ఏం చెబుతారో.. మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఆయన మాత్రమే కాదు.. వైసీపీ నేతలందరి తీరు అంతే ఉంది.

కిషన్ రెడ్డికి కూడా హోదా ముగిసిన అధ్యాయనమేనట..!

తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కిషన్ రెడ్డికి.. ఓ కేంద్రమంత్రి పదవి దక్కింది. అది కూడా.. అమిత్ షాకు డిప్యూటీ. ఆయనకు ఉన్న ఇద్దరు డిప్యూటీల్లో ఒకరు కిషన్ రెడ్డి. సాధారణం అమిత్ షా అంటే.. నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇతురలకు ఉండదు. కనీసం సొంతంగా ఓ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేరు. ఇలా ఇచ్చి.. మొదటి రోజే.. చీవాట్లు తిన్నారు కిషన్ రెడ్డి. ఆయన పని.. కేంద్రమంత్రి హోదాను పట్టుకుని… తెలుగు రాష్ట్రాల్లో ప్రోటోకాల్‌ను పొంది.. అధికార పర్యటనలు చేయడమే. సొంత నియోజకవర్గంలో పలుకుబడి పెంచుకోవడమే. అయినా కూడా పెత్తనం తీసుకుని… ఏపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయనమి తేల్చేస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు .. స్పందించడానికి కూడా సందేహిస్తున్నారు.

కేంద్రమంత్రుల ప్రకటనలను వైసీపీ ఎందుకు ఖండించడం లేదు..?

ప్రత్యేకహోదా విషయంలో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేసి.. రాజీనామాలు చేసి దీక్షకు కూర్చుంటే.. హోదా ఎందుకు రాదో చూద్దామన్న జగన్.. ఇప్పుడు… ఎందుకు.. అంత సామరస్య ధోరణితో వెళ్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. అధికారంలో ఉంటే.. ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. ప్రజలకూ పజిల్‌లానే మారింది. చివరికి.. తాము సన్నిహితంగా ఉంటున్న బీజేపీ కేంద్రమంత్రులే… అదే పనిగా.. హోదా సాధ్యంకాదని చెబుతూంటే.. ఒక్క ఖండన ప్రకటన కూడా చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close