కర్ణాటకలో విభజన చిచ్చు పెడుతున్న బీజేపీ..!

ఉత్తరాదిలో తగ్గిపోయే సీట్లను…దక్షిణాదిలో పెంచుకోవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే.. ఒక్క రాష్ట్రంలోనూ.. ఆశావాహ పరిస్థితులు కనిపించడం లేదు. అంతో ఇంతో బలంగా కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ పొత్తులో భాగంగా కలసి పోటీ చేస్తే.. బీజేపీకి చాలా పెద్ద దెబ్బ పడుతుంది. కలసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో…బీజేపీ విభజన వాదం వినిపించడం ప్రారంభించింది. తమకు బలం లేని ప్రాంత వాసులపై… తమకు పట్టు ఉన్న ప్రాంతాన్ని ఉసిగొల్పడం ప్రారంభించారు. దానికి బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చనే వేదికగా చేసుకుంటున్నారు.

సీఎం కుమారస్వామి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉత్తర కర్ణాటక ప్రాంతానికి నిధులూ కేటాయించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. నిధులన్నింటినీ దక్షిణ కర్ణాటకకే కేటాయించుకుంటూ పోతే… ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు కావడమే మంచిదని బి.శ్రీరాములు, ఉమేష్ కట్టి లాంటి నేతలు బహిరంగ ప్రకటనలు ప్రారభించారు. అయితే అదే సమయంలో.. సీఎం కుమారస్వామి నోరు జారారు.
రైతు రుణమాఫీ వల్ల దక్షిణ జిల్లాల కంటే ఉత్తర కర్ణాటకకే ఎక్కువ ప్రయోజనం కలిగిందని ఆయన చెప్పారు. దానితో పాటే అభివృద్ధిని కాంక్షించేవారైతే ఉత్తర కర్ణాటక ప్రజలు తమ పార్టీకే ఓటు వేసే ఉండేవారని కుమారస్వామి వ్యాఖ్యానించడంతో.. ఇతర పార్టీలకు ఓ అస్త్రం దొరికినట్లయింది. ఉత్తర కర్ణాటక ఓటర్లను సీఎం అవమానించారంటూ..సెంటిమెంట్ రేపడం ప్రారంభించారు. పరిణామాలను బట్టి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం.. బీజేపీ ఈ విభజన సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా విభజన వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ముంబై- కర్ణాటకతో పాటు హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంలోని 96 శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. నిజానికి ఈ రెండు ప్రాంతాలు హస్తం పార్టీకి కంచుకోటలుగా భావిస్తారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజనతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విషయంలో అలాంటి తప్పుచేసేందుకు సిద్ధంగా లేదు. ఉత్తర కర్ణాటక ఓటర్లను కుమారస్వామి విమర్శించిన తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. కర్ణాటక ప్రజలు ఐకమత్యంగానే ఉంటారని, రాష్ట్ర విభజన అసాధ్యమని కాంగ్రెస్ కు చెందిన ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర తేల్చిచెప్పారు. అధికారదాహంతో లోక్ సభా స్థానాల కోసం బీజేపీ ఇప్పుడు కర్ణాటకను విభజించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అంటోంది. మరి ఈ వివాదం ఎటు పయనిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close