బాబూ! ఇదేంపద్ధతి? బిజెపికి కోపమొచ్చింది!!

ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదని తెలుగుదేశం వైఖరిని బిజెపి కేంద్రనాయకత్వం తప్పుపడుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన సమాధానంపట్ల తెలుగదేశం అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముందు వ్యక్తం చేసిన చేసిన వ్యాఖ్యానాలు ను బిజెపి రాష్ట్ర ఇన్ చార్జ్ సునిశితంగా పరిశీలించి పార్టీ అధ్యక్షునికి నివేదించారని తెలిసింది. బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత విలేకరుల సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక మంత్రిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేయటం మంచిదికాదని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. తెదేపా నేతలు బాహాటంగా విమర్శలు గుప్పించకుండా బిజెపి అధినాయకులతో అంతర్గత చర్చలు జరిపితే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్నది వారికి మింగుడుపడటంలేదు.

”ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనేది గత ఏడాదే చంద్రబాబుకు స్పష్టం చేశాం. హోదాకు బదులు అత్యధిక ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తూన్న సమయంలో, చంద్రబాబు విమర్శలు గుప్పించటమేంటని” ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఏపీకి వివిధ పథకాల అమలులో 90 శాతం గ్రాంటు, పది శాతం రుణం లభిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఏపీకి ఇంతకంటే ఎక్కువే ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వాదిస్తున్నారు. ఏపీకి హోదా కావాలా? లేక అంతకంటే ఎక్కువ అర్థిక ప్యాకేజీ కావాలా? అని సుజనాచౌదరి వద్ద కేంద్రమంత్రి ఒకరు నిష్టూరంగా వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు

ఇలా వుండగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి వివరించేందుకు తెలుగుదేశం ఎంపీలు ప్రధాని అప్పాయింట్‌మెంట్ అడిగారు.మోదీ మాత్రమే హోదా సమస్యను పరిష్కరించగలుగుతారని వారు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక పాకేజీ ప్రతిపాదనలు సిద్ధమయ్యాక వీరికి అపాయింటుమెంటు దొరకవచ్చు లేదా వెంటనే అపాయింట్ మెంటు ఇచ్చి పరిష్కారానికి కొంత వ్యవధి కోరవచ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close