కర్ణాటకలో మతం – ఆంధ్రప్రదేశ్‌లో కులం..! బీజేపీ ఎదుట పరిష్కరించలేని సమస్య…!!

కర్ణాటకలో ఎన్నికల ముంగిట.. భారతీయ జనతాపార్టీకి చాలా చిత్రమైన సమస్య ఎదురొచ్చింది. అదే లింగాయత్‌లకు మైనారిటీ మతం హోదా. ఒకప్పుడు బీజేపీ ఎలుగెత్తిన డిమాండే అది. లింగాయత్‌ అయిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించడంతో.. దానికి విరుగుడుగా…. లింగాయత్‌లలో ఎప్పటి నుంచో ఉన్న మతం హోదా డిమాండ్‌ను కర్నాటక సీఎం సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. కేబినెట్‌లో తీర్మానం చేసి… కేంద్రానికి పంపారు. దాంతో బాల్ కేంద్రం కోర్టులో పడింది. ఒకప్పుడు తాము చేసిన డిమాండే అయినా… బీజేపీ అనుకూలంగా … నిర్ణయం తీసుకోలేకపోయింది. లింగాయత్‌లకు మతం హోదా ఇస్తే క్రెడిట్ అంతా సిద్ధరామయ్యకు వెళ్తుంది. కుదరదు అని చెప్పినా లింగాయత్‌ల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇవ్వకపోతే.. కనీసం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్న వీరశైవుల మద్దతు అయినా పొందవచ్చని బీజేపీ మతం హోదా ఇవ్వబోమని ప్రకటించింది. బీజేపీ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో మే పదిహేనో తేదీన తెలుస్తుంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ.. అలాంటి సమస్యే బీజేపీకి ఎదురొస్తోంది. కాపులను బీసీల్లో చేర్చే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడది కేంద్రం వద్ద ఉంది. కాపు రిజర్వేషన్లను ఆమోదించి.. షెడ్యూల్ నైన్‌లో చేర్చాలని… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగానే ఒత్తిడి తెస్తోంది. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కేంద్రం లేదు. రిజర్వేషన్లకు ఆమోదం అంశాన్ని…కేంద్రం ఒక్క ఏపీతోనే తేల్చుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ల తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను ఆమోదించాలంటూ … కేంద్రంపై ఘాటు విమర్శలు కూడా చేసింది. పార్లమెంట్‌లో ఆందోళన కూడా చేశారు.
అలా అని … ఏదో విధంగా రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే… దాని వల్ల వచ్చే లాభం బీజేపీకి ఏమీ ఉండదు. అసలు రిజర్వేషన్లు ఇచ్చి… అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏపీ ప్రభుత్వానికే ఆ క్రెడిట్ దక్కుతుంది. బీజేపీ లెక్కలేసుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లతో అంతో ఇంతో కోత పడుతుంది. మరి ఇవ్వకపోతే.. లాభం కలుగుతుందా అంటే.. అదీ ఉండదు. తాము కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నామని.. కేంద్రం కుట్రతోనే తొక్కి పెట్టిందని విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీంతో.. బీజేపీపై కాపుల్లో అనుమాన మేఘాలు ఏర్పడతాయి.

ఏ విధంగా చూసినా… బీజేపీ తమ ఓటు బ్యాంక్‌గా మరల్చుకోవాల్సిన ప్రయత్నిస్తున్న కాపు సామాజికవర్గానికి… రిజర్వేషన్ల విషయంలో స్పష్టమన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది అచ్చంగా లింగాయత్‌ల సమస్య లాంటిదే. కర్ణాటకలో కొన్ని ఇతర వర్గాలు… బీజేపీకి అండగా ఉంటాయేమో కానీ… బీజేపీ అలాంటి బేస్ ఓటు బ్యాంక్ ఏపీలో లేదు. అందుకే… రెండు వైపులా పదునున్న కత్తిని.. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. ఏపీలో అడుగుపెట్టాలంటే.. బీజేపీ ముందుగా ఈ సమస్యను చాణక్యంతో అధిగమించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close