రాయలసీమ టీడీపీ నేతలపై బీజేపీ కన్ను..! ఆపరేషన్ స్టార్ట్..?

రాయలసీమకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారంటూ.. ఓ వర్గం మీడియాలో… కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాళ్లు చేరుతారో లేదో కానీ.. రోజూ.. ఆ వార్తలు రాసి రాసి.. వారిపై.. టీడీపీలో అనుమానాలు కలిగేలా చేయడమే ఈ వార్తల వెనుక ఉన్న లక్ష్యం. ముందుగా రాయలసీమపై దృష్టి పెట్టిన.. భారతీయ జనతా పార్టీ.. అక్కడి టీడీపీ నేతలందర్నీ.. తమ పార్టీలో చేర్చుకుని… టీడీపీ బదులుగా.. బీజేపీ అనే నినాదాన్ని తేవాలనుకుంటోంది. అందులో భాగంగా… ఆపరేషన్‌లో మొదటి భాగం… నేతలు బీజేపీలో చేరబోతున్నారనేది..!

సీమ టీడీపీ నేతలపై సాక్షికి అంత సానుభూతా..?

సాక్షి మీడియాతో పాటు.. మరికొన్ని చానళ్లు… ఎప్పుడూ లేని విధంగా.. అనంతపురం జిల్లాలోని టీడీపీ నేతలపై సానుభూతి వ్యక్తం చేస్తూ … వాళ్లకు టీడీపీ వల్లే కష్టాలొచ్చాయని.. బీజేపీలో చేరితే వారి కష్టాలు తీరుతాయని.. అందుకే వారు ఆ దిశగా.. ప్రయత్నిస్తున్నరాని వార్తలు రాస్తున్నారు. జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీ, పల్లె ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ..పోతే.. అనంతపురం జిల్లాలో ఉన్న అందరు టీడీపీ నేతలపైనా.. ఈ తరహా కథనాలు రాస్తున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందే అనుకునేంతలో అసలు విషయం బయటకు వస్తోంది. ఈ కథనాలు ప్రారంభమైన తర్వాత.. ఆయన నేతల స్పందనను తెలుసుకోవడానికి కొంత మంది చోటా బీజేపీ నేతల ద్వారా… ప్రయత్నాలు చేశారు. ఆ కథనాలపై.. ఆ నేతలంతా నవ్వుకుని లైట్ తీసుకున్నారని తెలిసింది. కానీ వారి మనసులో ఓ ముద్ర అయితే వేయగలిగామన్న ఉద్దేశంతో.. రెండో అంచె ఆపరేషన్ ప్రారంభించారని అంటున్నారు.

ఢిల్లీ నుంచి సీమకు వస్తున్న ఫోన్ కాల్స్ సారాంశం ఏమిటి..?

రెండో అంచెలో.. రాయలసీమ టీడీపీ నేతలకు… బీజేపీ నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమయింది. వ్యాపారాలు.. ఉన్న నేతల్ని ముందుగా టార్గెట్ చేసుకుని ఆర్థిక ప్రయోజనాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. లొంగకపోతే… నోటీసులు … లాంటివి ఎలాగూ ఉంటాయని చెబుతున్నారు. అందుకే.. బీజేపీలో చేరిక ప్రచారాన్ని మరింత ఉద్ధృతంగా చేయిస్తున్నారు. ఇందులో.. అసలు ట్విస్ట్ కూడా ఉంది. టీడీపీ నేతలే.. టీడీపీ నేతలను… బీజేపీలో చేరుదామని.. ఒకరికొకరు సంప్రదించుకుంటున్నారని… ఆ పుకార్ల సారాంశం. పేర్లు బయటకు రాకుండా.. ఇలా చర్చించుకుంటూ… టీడీపీ నేతల్ని చేర్చుకోవాలనుకుంటున్నారు.

నేతలు మారితే టీడీపీ బలహీనపడుతుందా..?

పార్టీ నేతలు మారితే… టీడీపీ బలహీనపడుతుందా.. అంటే.. అంచనా వేయడం కష్టమే. వ్యక్తిగత ప్రాబల్యం ఉన్న నేతలు వెళితే.. నష్టం జరుగుతుందేమో కానీ.. మిగిలిన నేతలు వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని.. టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీనియర్ నేతలు ఎవరైనా వెళ్లదల్చుకుంటే… ఆపడం కన్నా.. వెళ్లనిస్తేనే బెటరని అనుకుంటున్నారు. టీడీపీకి ఇప్పుడు.. సీనియర్ నాయకులే భారంగా మారారని.. కొత్త నాయకత్వం రెడీగా ఉందని… టీడీపీ వర్గాలంటున్నాయి. మొత్తానికి… ఏపీలో.. బీజేపీ.. ముందుగా రాయలసీమ నుంచి ఆపరేషన్ ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close