ఆర్ఆర్ఆర్‌కు బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ..!

రాజమౌళి దర్శకత్వంలో రెడీ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీంపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్.. ముస్లిం యువకుడిని పోలి ఉండటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే.. సినిమా రీళ్లను తగులబెడతాని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. థియేటర్లలో ఆర్ఆర్ఆర్‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని సవాల్ చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు.

ఇక ఆదివాసీ వర్గానికి చెందిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరింత వయోలెంట్‌గా ఉన్నారు. భీం పాత్రకు పెట్టిన టోపీ, కుర్తా తొలగించాలని.. భీంను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం అవమానించడమేనని అంటున్నారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించేది లేదని అంటున్నారు. బీజేపీ నేతల ఘాటు హెచ్చరికలతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ట్రిపుల్ ఆర్ మరింతగా చర్చనీయాంశం అవుతోంది. నిజానికి అసలు కథేంటో ఎవరికీ తెలియదు.

అందులో భీం పాత్రేంటో కూడా యూనిట్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూసి బీజేపీ నేతలు ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. అయితే.. ఈ వివాదం విషయంలో సినిమా యూనిట్ గుంభనంగా ఉంటుంది. తమ సినిమా గురించి ఎంత చర్చ జరిగితే అంత మంచిదన్నట్లుగా ఉంది. అందుకే పూర్తిగా షూటింగ్ పైనే దృష్టి కేంద్రీకరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close