ఏడాది చివరిలోనే ఎన్నికలట…! తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..!!

పాక్షిక జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమయింది. రాజకీయాలు వేగంగా మారిపోతూండటం…. తమ ప్రభ వేగంగా ఆరిపోతూండటంతో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది చివరిలో లోక్‌సభతో పాటు 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. సాధారణంగా ఏడాది చివరిలో చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు.. పది నెలలోపు గడువు ఉండే అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, ఒరిస్సా శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించనుంది.

ఈ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ బిల్లులు రెడీ అయ్యాయని జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. ఓ వైపు పెరుగుతున్న అధికార వ్యతిరేకత… ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడటంతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. వచ్చే ఏడాది దాకా ఆగితే విపక్ష పార్టీలకు మరింత సమయం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. నవంబర్‌ తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. రూ.2 వేల కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహితంగా ఉండే పార్టీలకు ముందస్తు ఎన్నికలపై … సంకేతాలిస్తోంది బీజేపీ. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు కూడా నేరుగా చెబుతున్నారు.

ముందస్తు ఎన్నికలు బీజేపీకి అచ్చి రాలేదు. వాజ్‌పేయి హయాంలో భారత్‌ వెలిగిపోతోందన్న నినాదంతో ముందస్తు ఎన్నికలు వెళ్లారు. కానీ పరిస్థితి అనుకూలంగా మారలేదు. ఓటమి చవి చూడాల్సి వచ్చింది. పదేళ్ల పాటు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు బీజేపీకి ఎదురీదుతోంది. అయనా ముందస్తు ఆలోచన చేస్తోంది. ఇంకా లేటు చేస్తే.. ఇబ్బంది పడతామనే ఆలోచనతోనే ముందస్తుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ సారి కలిసి వస్తుందో.. మొత్తానికే మోసం వస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close