బీవేర్ ఆఫ్ జీవీఎల్‌..! రాష్ట్రపతి పాలన విధించేయగలరు..!

  1. ఉత్తరప్రదేశ్‌ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన జీవీఎల్ నరసింహారావు.. దేశంలో తనకంటే.. గొప్ప నేత లేడన్నట్లు ఫీలవుతున్నారు. రాజ్యాంగాలు, చట్టాలు అంటే.. తను చెప్పినవే అని అనుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఆయన ఇదే తరహా వాదనలు వినిపిస్తున్నప్పటికీ… ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన మరింతగా చెలరేగిపోతున్నారు. “ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించేయగలను జాగ్రత్త” అన్నట్లుగా.. నేరుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి గతంలోనూ వచ్చాయి. ఓ సారి కన్నా లక్ష్మినారాయణను.. ఓ లారీ డ్రైవర్.. కావలిలో చెప్పుతో కొట్టినప్పుడు…  అంతకు ముందు తిరుమలలో అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురుగా నిలబడి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపినప్పుడు కూడా… జీవీఎల్ ఇలానే మాట్లాడారు.

విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి జరిగిన క్షణాల్లోనే ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు కొత్తగా..కొంచెం లేటుగా మరోసారి అలాంటి డిమాండ్ చేశారు. ఈ సారి ఎందుకంటే..” ఏపీ ప్రజల నిరసనలకు భయపడి… ప్రధాని ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నారని”… టీడీపీ నేతలు విమర్శించడమట. ఈ నెల మొదట్లో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఏపీ పర్యటనకు రావాలనుకున్నారు. కానీ.. పరిస్థితి తేడాగా ఉందని ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లడంతో ఎందుకైనా మంచిదని..మోడీ మిడిల్ డ్రాప్ అయ్యారు. ఏపీకి చేసిన అన్యాయంపై  ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పర్యటన వాయిదా వేసుకున్నారని… టీడీపీ నేతలు.. విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు.

ఈ మాటలు బీజేపీ నేతలకు.. సూటిగా గుచ్చుకుంటున్నాయి. తనకు రాజ్యసభ సీటు ఇచ్చిన మోడీని దైవంగా చూస్తున్న జీవీఎల్‌ను ఈ మాటలు మరింతగా బాధిస్తున్నట్లున్నాయి. అందుకే… అల్టిమేట్‌గా రాష్ట్రపతి పాలన హెచ్చరికలు చేస్తున్నారు. ” టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని” విజయవాడలో బాధతో జీరబోయిన గొంతుతో.. హెచ్చరికలు పంపారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి.. ఒక్క మాట మాట్లాడలేని.. జీవీఎల్ లాంటి నేతలు… ప్రజాప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి… తాము చెప్పిందే రాజ్యాంగమన్నట్లుగా.. వ్యవహరిచడానికి సిద్ధపడుతూంటారు.  ఏపీలో ఇక ముందు జీవీఎల్ పర్యటించేచోట్ల..” బీవేర్ ఆఫ్ జీవీఎల్” అని బోర్డులు తగిలించాల్సి వస్తుందన్నట్లుగా.. ఆయన హుంకరిపులు, బెదిరింపులు సాగుతున్నాయి. అంతా ఢిల్లీలో ఉన్న అధికారం మహిమ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close