రాజ్యాంగపరమైన హెచ్చరిక : బీజేపీ లీడర్స్.. మాకూ వాక్‌స్వాతంత్య్రం ఉంది…!

“ములాయంను అఖిలేష్ కొట్టారన్న వార్త ఓ సారి జనంలోకి వెళ్లింది. అది తీవ్ర ప్రభావం చూపింది. తర్వాత అది ఫేక్ అని తేలింది. కానీ దాని వల్ల వచ్చిన ప్రయోజనం వేరు. అందుకే.. ఫేక్ అయినా కానీ ప్రచారం ప్రభావవంతంగా ఉండాలి..” ఇది 2018 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ క్యాడర్‌కు ‌అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన సందేశం. దానికి సంబంధించిన మీడియా రిపోర్ట్, వీడియో లింక్… ఇందులో ఉంది. (https://thewire.in/politics/amit-shah-bjp-fake-social-media-messages). ఇక్కడ లింక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే.. ఇప్పుడు… ఏ అసత్యాలు.. ఏ అభూతకల్పనలు అయితే ప్రచారం చేసి.. వైరల్ చేసి.. రాజకీయ లబ్ది పొందిన భారతీయ జనతా పార్టీ ఉందో.. అదే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ.. తమపై ఎవరైనా వ్యతిరేకంగా ప్రచారం చేస్తే… అది ఫేక్ అని.. ముద్ర వేసి.. “బతుకు” లేకుండా చేస్తామని వార్నింగ్‌లు ఇస్తోంది. దీని కోసం బహిరంగ హెచ్చరిక ప్రకటన కూడా విడుదల చేసింది.

“సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలకు” బీజేపీనే తల్లీ, తండ్రి..!

ఇప్పుడు నిజం అంటే… ఎక్కువ మంది నమ్మేదే. సోషల్ మీడియాలో చేసే ఉద్ధృతమైన ప్రచారం ద్వారా చాలా మంది కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా నమ్మడం లేదు. సోషల్ మీడియాలో చెప్పేదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని తెచ్చి పెట్టింది నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ. రాజకీయ ప్రయోజనాల కోసం.. అబద్దాలు.. ఫేక్‌ న్యూస్‌లు.. ఇష్టం లేని నేతల వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతూ.. ఉద్ధృతమైన రాజకీయ ప్రచారం చేసేది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ సోషల్ మీడియా బడ్జెట్ ఎంతో తెలిస్తే.. సామాన్య జనానికి కళ్లు తిరగకుండా ఉండవు. ఇక వారి ప్రచారంతో … దేశభక్తి అంటే… బీజేపీ భక్తి అన్నట్లుగా మారిపోయి.. ఓ రకమైన “ట్రాన్స్‌”లోకి వెళ్లిపోయిన వారు చేసే విద్వేష ప్రచారం మొత్తం వ్యవస్థకే ప్రమాదకరంగా మారింది. ప్రజల్లో వర్గాల వారీగా చిచ్చుపెట్టి బతికేస్తున్న రాజకీయంలో బీజేపీ సోషల్ మీడియా చేసే ఫేక్ ప్రచారాలదే అత్యధిక వాటా.. !

తమకు వ్యతిరేక పోస్టులు పెడితే “బతుకు” మీద కొడతరాట..!

ఇంత ఘన చరిత్ర ఉన్న బీజేపీ ఇప్పుడు.. తమకు వ్యతిరేకంగా ఉన్న గళాలను కూడా అణగదొక్కడానికి బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం.. వాక్ స్వాతంత్ర్యం ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే పోస్టులను పరిశీలించడానికి ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నామని.. ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కేసులు మాత్రమే కాదు.. అన్ని రకాలుగా వేధిస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేసేశారు. విదేశాల్లో ఉంటే.. ఎంబసీలకు తెలియచేస్తారట. ఉద్యోగాలు చేసేవారయితే.. ఉద్యోగాలు తీయించేస్తారట. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే చర్యలు తీసుకోమని సూచిస్తారట.

ఇతర పార్టీల నేతల “క్యారెక్టర్ల”ను బీజేపీ సోషల్ మీడియా చంపేయలేదా..?

భారతీయ జనతా పార్టీ బెదిరింపులు ఇవ్వడానికి ముందు.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై జీవీఎల్ నరసింహారావు కేసు పెట్టించారు. ఎందుకంటే… ఆయనకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారట. నిజానికి జీవీల్.. ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో ఏపీ సర్కార్‌కు అనుకూలంగా మాట్లాడటంతో… ఒక్క తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే… కాదు ఇతరులు కూడా.. ఆయన తీరును ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఆయన తీరు మొదటి నుంచి తేడాగా ఉందని అనుమానించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన బ్రదర్ అనిల్ కుమార్ బంధువు అనే ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఆయన బంధుత్వాల్లో నిజం ఎంతో.. ఎవరికీ తెలియదు. అలాంటి ప్రచారం జరిగినప్పుడు.. బ్రదర్ అనిల్ తనకు బంధువు కాదని చెప్పుకుంటే పోతుంది.. కానీ తనపై క్రిస్టియన్ ముద్ర వేస్తున్నారని ఆయన ఫీలైపోయారు. పార్టీ నేతలతో ఎదురుదాడి చేయించారు. విష్ణువర్ధన్ రెడ్డితో టీడీపీ నేతల్ని చెడామడా తిట్టించారు. చివరికి అలాంటి ప్రచారాలు చేస్తే ఊరుకోమంటూ… హెచ్చరికలు పంపిస్తూ.. ఓ ప్రెస్‌నోట్‌ను కూడా రిలీజ్ చేయించారు.

ఇండియాలో అందరికీ వాక్‌స్వాతంత్య్రం ఉంది.. ఒక్క బీజేపీ నేతలకే కాదు..!

ఇండియాలో రాజ్యాంగ పరంగా వాక్‌ స్వాతంత్య్రం ఉంది. కానీ ప్రభుత్వాలు దాన్ని కాలరాయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఏది రియల్.. ఏది ఫేక్ అనేది బీజేపీ నిర్దారించాల్సిన పరిస్థితి ఇంకా రాలేదు. వారికి అనుకూలమైనవన్నీ రియల్.. వ్యతిరేకమైనవన్నీ ఫేక్ అనుకుని కేసులు పెట్టేస్తే.. దేశంలో సగం మంది జనాభాపై కేసులు పెట్టాలి. నిజంగా ఫేక్ న్యూస్‌పై కేసులు పెట్టాలి.. అంటే..బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరూ బుక్ అయిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తమకు వ్యతిరేకంగా గళం విప్పకుండా.. కేసులు పెడతామని.. ఉద్యోగాలు పోగొడతామని.. బతుకు లేకుండా చేస్తామని బెదిరించడం ఖచ్చితంగా నియంతృత్వమే. రాజ్యాంగం ద్వారా అధికారంలో ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే… ప్రజాస్వామ్యానికే మంచిది. లేకపోతే.. రాజకీయలాభం తాత్కాలికంగానే వస్తుంది.. కానీ జరగబోయే నష్టం.. దేశానికి జరుగుతుంది.

ప్రజాస్వామ్యంలో నియంతలు మనుగడ సాగించలేరు…!

నిజంగా బీజేపీకి ఫేక్ న్యూస్.. పరువు నష్టం కలిగించేపోస్టులను కట్టడి చేయాలని ఉంటే.. ముందుగా తమ విధానాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ పార్టీకి చెందిన సంబిత్ పాత్రా అనే అధికార ప్రతినిధి చేసే ట్వీట్లలో 60శాతం ఫేక్ అని తేలింది. ఇక బీజేపీ సోషల్ మీడియా చేసే ఫేక్ క్యాంపెన్ల గురించి విశ్లేషించడానికి ప్రత్యేకంగా ఎక్స్‌పర్ట్‌లు అవసరం లేదు. అధికారంలో ఉన్న వారే ..దాన్ని అడ్డంపెట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూంటే… తాము మాత్రం నీతి నిజాయితీగా ఎందుకు ఉండాలని ఇతరులు అనుకుంటారు. అందుకే.. ముందుగా బీజేపీ తన బురదను కడుక్కుని ఇతరుల మీదకు వస్తే మంచిది. లేకపోతే.. ఇవాళ కాకపోతే.. రేపైనా ఆ పతనం తప్పదు. చరిత్రలో హిట్లర్ నుంచి ముషారఫ్ వరకూ అందరూ… ఎప్పుడో ఓ సారి తలదించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అయితే.. అది ఇంకా ఇంకా త్వరగా జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close