నంబ‌రు ఇస్తే డ‌బ్బులేసేస్తారంటున్న హ‌రిబాబు..!

ఏపీ భాజ‌పా మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ హ‌రిబాబు పార్ల‌మెంటులో మాట్లాడారు. టీడీపీ నేత‌లు ప్ర‌వేశ‌పెట్టిన విశ్వాస తీర్మానంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని పూర్తిస్థాయిలో వెనకేసుకుని వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆంధ్రాకి సాయం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా సిద్ధంగా ఉంద‌నీ, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల‌నే సాయం అంద‌లేద‌న్న పాత వాద‌నే మరోసారి వినిపించారు. ప్ర‌త్యేక హోదాకి బ‌దులుగా దానితో స‌మాన‌మైన సాయాన్ని అందించేందుకు కేంద్రం ఎప్పుడో సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింద‌న్నారు.

స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ ఏర్పాటు చేస్తే… రూ. 17,500 కోట్లు ఇచ్చేందుకు మోడీ స‌ర్కారు సిద్ధంగా ఉంద‌న్నారు. ఇప్పుడు బ్యాంకు అకౌంట్ నంబ‌ర్ ఇస్తే…రేపు, అంటే శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల్లోపు ఆ సొమ్మంతా ఆంధ్రా అకౌంట్ లో ఉంటుంద‌న్నారు. ఏపీ ఎంపీలు ముందుగా అకౌంట్ నంబ‌ర్ ఇవ్వాల‌ని కోరారు! కానీ, టీడీపీ స‌ర్కారుకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై ఏమాత్రం ఆస‌క్తి లేదన్నారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను మాత్ర‌మే చూసుకుంటోంద‌న్నారు. త‌మ‌తో క‌లిసి నాలుగేళ్లు ఉన్నార‌నీ, ఇప్పుడు రాజ‌కీయ కార‌ణాలు చూసుకుంటూ దూర‌మ‌య్యార‌నీ, త‌మ‌తో టీడీపీ ఉన్నా లేక‌పోయినా ఆంధ్రా కోసం కేంద్రం ఉంద‌న్నారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకునేందుకు న‌రేంద్ర మోడీ స‌ర్కారు సిద్ధంగా ఉంద‌న్నారు.

ఆంధ్రాకి కేంద్రం ఇవ్వాల్సిన‌వి ఐదంటే ఐదు మాత్ర‌మే పెండింగ్ లో ఉన్నాయ‌న్నారు. వాటిలో, గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఒక‌ట‌నీ, అది రాబోతోంద‌న్నారు. రెండోది విశాఖ రైల్వేజోన్ అని హ‌రిబాబు చెప్పారు. అది సాధ్యం కాద‌ని రిపోర్టు వ‌చ్చినా, ఏ విధంగా అయితే సాధ్య‌మౌతుంద‌నే అంశ‌మై ఒక క‌మిటీ వేశార‌నీ, త్వ‌ర‌లోనే రైల్వే జోన్ ను కేంద్రం ప్ర‌క‌టిస్తుంద‌న్న ధీమా వ్య‌క్తం చేశారు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాద‌ని నివేదిక‌లు వ‌చ్చినా… సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు, అది కూడా త్వ‌ర‌లోనే కేంద్రం ప్ర‌క‌టించేస్తుంద‌న్నారు. ఇక‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు విష‌యానికొస్తే… ప్ర‌త్యామ్నాయ స్థలాన్ని చూపించాలంటూ ఆంధ్రాని కేంద్రం కోరినా ఇంత‌వ‌ర‌కూ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదంటూ జాప్యానికి కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే అన్నారు.

ఇలా కేంద్రం చేశామ‌ని చెప్పుకున్న‌వి చెప్పారు! చేస్తామన్న‌వి అతి త్వ‌ర‌లో చేసేస్తుంద‌ని కేంద్రం త‌ర‌ఫున మాట్లాడారు. అయితే, భాజ‌పా ఎంపీగా ఆయ‌న మోడీ స‌ర్కారుకు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టం ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధిగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌య‌మై సున్నితంగానే కేంద్రాన్ని డిమాండ్ చేయ‌క‌పోవ‌డం శోచ‌నీయం. పెండింగ్ ఉన్న స‌మ‌స్య‌ల్ని, హామీల్నీ వెంట‌నే పూర్తి చేయండ‌ని మాట‌వ‌ర‌స‌కైనా అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close