కమలనాథుల తదుపరి టార్గెట్ కర్ణాటకా?

కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని నిజం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, యూపీఏ ఓడిపోయి బీజేపి, దాని మిత్ర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చాయి. అది ప్రజాస్వామికంగా జరిగిన ప్రక్రియ. కానీ మరో విధంగా ప్రభుత్వాలను పడగొట్టే కళలో కాంగ్రెస్ ను అనుసరిస్తోందనే విమర్శలను కమలనాథులు ఎదుర్కొంటున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అంతర్గల కలహాల వల్లే తిరుగుబాటు వచ్చిందనేది బీజేపీ వాదన. గవర్నర్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం చక్రం తిప్పిందని, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బీజేపీ అధికార దుర్వినియోగం ద్వారా సహకరించిందని బాహాటంగానే విమర్శలు వచ్చాయి. రెబెల్స్ పై స్పీకర్ వేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.

నిజంగా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమే అయితే కేంద్రం అంత ఆగమేఘాల మీద కేబినెట్ మీటింగ్ పెట్టి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం ఏమిటి? స్పీకర్ నిర్ణయంపై రాజకీయ పోరాటం చేస్తారా లేక న్యాయ పోరాటం చేస్తారా అనేది కాంగ్రెస్ రెబెల్స్ తేల్చుకోవాల్సిన విషయం. విశ్వాస పరీక్షలో హరీష్ రావత్ ప్రభుత్వం నెగ్గుతుందో లేదో సభలోనే తేలాల్సింది. కానీ రెబెల్స్ పై వేటు తర్వాత కేంద్రం జోక్యం చేసుకున్న తీరు పక్షపాతానికి అద్దం పడుతోందని ఆరోపణలు వచ్చాయి. గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా ఇలాగే ప్రభుత్వాలను పడగొట్టిందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అంతే తేడా.

ఈ వివాదాలు అంతటితో ఆగలేదు. బీజేపీ రాజకీయ కుట్ర హిమాచల్ ప్రదేశ్ కు విస్తరించిందని కాంగ్రెస్ మండిపడుతోంది. వీరభద్ర సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నిందని దుమ్మెత్తి పోస్తోంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. వారు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. దీంతో సీఎం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధినేత్రి సోనియా గాంధీకి పరిస్థితిని వివరిస్తారు. దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.

బీజేపీ నుంచి సంకేతాలు లేదా హామీలు లేనిదే ఇలా వరసగా ఒక్కో రాష్ట్రంలో తిరుగుబాటు సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి వ్యూహాలు పన్నడం రాజకీయంలో పరిపాటి. అదే అసలైన రాజనీతి అనే వారూ ఉన్నారు. అయితే, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగినట్టే ఇప్పుడు బీజేపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతున్నాయి లేదా మారిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ స్కెచ్ వేసిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో పెద్ద రాష్ట్రం కర్ణాటక. అక్కడ తిరుగుబాట్లను ప్రోత్సహించాలనేది కమలనాథుల వ్యూహమన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. అయితే అది నిజంగా జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు పరిశీలకులు.

బీజేపీ దక్షిణాదిన అధికారంలోకి వచ్చిన తొలిరాష్ట్రం కర్ణాటక. కానీ గత ఎన్నికల్లో పరాజయం పాలైంది. మరో రెండేళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం ఉండటం మంచిదని బీజేపీ భావిస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రజాకర్షక పథకాలు, కొంత ఆకట్టుకునే పరిపాలన ద్వారా 2018 ఎన్నికల్లో మరోసారి కర్ణాటకలో పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్ అనే వారూ ఉన్నారు. అది నిజం కావచ్చు. అబద్ధం కావచ్చు. కానీ వరసగా మూడు రాష్ట్రాల పరిణామాలను గమనిస్తే, ఆ ప్రచారం నిజమైనా ఆశ్చర్యం లేదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close