వ‌ర‌వ‌ర‌రావు అరెస్టు… రాజ‌కీయ కోణమేంటి..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హత్య‌కు కుట్ర‌… కొన్ని నెల‌ల‌ కిందట దీనికి సంబంధించి బీమా కోరేగావ్ ఘటన సందర్భంగా తెరమీదికి వచ్చిన కోణం ఇది. రాజీవ్ గాంధీ త‌ర‌హాలో ప్ర‌ధాని మోడీని హ‌త్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర ప‌న్నుతున్నారంటూ ఆ సంద‌ర్భంగా జరిగిన సోదాల్లో ఓ ఉత్త‌రం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కుట్ర‌కు సంబంధించిన ఆర్థిక అవ‌స‌రాల‌న్నీ వ‌ర‌వ‌ర‌రావు స‌మ‌కూర్చుతున్నార‌నేది దాన్లో ఉంద‌న్నారు. ఇదే అంశ‌మై పూణె పోలీసులు వ‌ర‌వ‌ర‌రావును హైద‌రాబాద్ లో అరెస్టు చేశారు.

ఢిల్లీ, ఫ‌రీదాబాద్‌, గోవా, ముంబై, రాంచీ, హైద‌రాబాద్ ల‌లో 9 మంది యాక్టివిస్టుల‌పై పోలీసులు దాడులు చేసి ఐదుగుర్ని అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టుల‌పై నిర‌స‌న కూడా తీవ్ర‌స్థాయిలో వ్య‌క్త‌మౌతూ ఉండ‌టం విశేషం! ఒక ఉత్త‌రం దొరికింద‌న్న ఆ ఆధారంతోనే ఇలా అరెస్టులు చేయ‌డం స‌రికాద‌ని కొంత‌మంది అంటున్నారు. రామ‌చంద్ర గుహ‌, ప్ర‌శాంత్ భూష‌ణ్‌, అరుంధ‌తీ రాయ్ వంటివారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే, స‌రైన ఆధారాలు త‌మ ద‌గ్గ‌ర ఉండ‌బ‌ట్టే అరెస్టులు చేశామ‌ని పోలీసులు అంటున్నారు. ప్ర‌ధాని హ‌త్య‌కు వీరంతా కుట్ర ప‌న్నార‌ని చెబుతున్నారు.

ఈ అరెస్టుల నేప‌థ్యంలో రాజ‌కీయ కోణంలో కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు ప్ర‌ముఖ రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్నాయి. ఈ మధ్య భాజపా గ్రాఫ్ బాగా పడిపోతోందని సర్వేలున్నాయి. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం మావోయిస్టు ప్ర‌భావితం రాష్ట్రం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో కూడా కొంత ప్ర‌భావం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోంద‌నీ, అయినా స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నానంటూ మోడీ ప్ర‌చారం చేసుకోవాల‌న్న వ్యూహం అరెస్టులు వెన‌క ఉంద‌నే అభిప్రాయం కూడా ఢిల్లీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. సానుభూతిని గెయిన్ చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే కోణం కూడా ఉంద‌నే విశ్లేష‌ణ‌లూ ఉన్నాయి. ఇది మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల వ్యూహంలో భాగ‌మ‌నేవారూ ఉన్నారు.

వ‌ర‌వ‌ర‌రావు మొద‌ట్నుంచీ సాహిత్యప‌రంగా ఎక్కువ‌గా వామ‌ప‌క్ష భావ‌జాలాన్ని వినిపిస్తూ వ‌చ్చారు. మేధావిగా ర‌చ‌యిత‌గా గుర్తింపు ఉంది. అయితే, ఇలా కుట్ర‌ల‌కు సొమ్మును స‌మ‌కూర్చార‌నే ఆరోప‌ణ‌లు గ‌తంలో ఎన్న‌డూ లేవు. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి హ‌త్య కుట్ర‌కు సంబంధించి కోట్ల నిధులు ఆయ‌న ద్వారా వెళ్లాయ‌న‌డంలో నిజానిజాలు ఎంతో ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా.. అలాంటి కుట్ర అంటూ జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close