సుషాంత్ ఆత్మహత్య కేసు బీజేపీకి ఆయుధంగా మారిందా..?

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతోంది. బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. కేంద్రం అంగీకరించింది. అయితే అసలు నేరం జరిగిన చోటు అయిన ముంబై.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో… ఈ ఆత్మహత్య రాష్ట్రాలు.. కేంద్రం మధ్య కొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. బీహార్ పోలీసుల అత్యుత్సాహం ప్రద‌ర్శిస్తున్నార‌ని మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముంబైలో జరిగిన నేరంపై బీహార్ పోలీసులు ఎలా విచారణ జరుపుతారని.. మహారాష్ట్ర ప్రశ్నిస్తోంది.

సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా రెండు నెలలు అవుతోంది. ఆత్మహత్యగా పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. అయితే… ఆ తర్వాత వివాదం అంతకంతకూ పెద్దదవుతూ వస్తోంది. మొదట సుషాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో పేరుకుపోయిన నెపోటిజం కారణం అని విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు రావడంతో… పోలీసులు అరవై మంది సెలబ్రిటీల్ని విచారించారు. అయితే..ఆ తర్వాత అనూహ్యంగా హత్య కోణం బయటకు వచ్చింది. సుషాంత్ సింగ్‌ది హత్య అంటూ ఆరోపణలు ఊపందుకున్నాయి. సుషాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిరోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు.

మరో వైపు బీహార్ పోలీసులు చాలా దూకుడుగా… ముంబై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. సుషాంత్ అకౌంట్‌లో యాభై కోట్ల రూపాయలు ఏమయ్యాయన్న ఆర్థిక కోణంలో ముంబై పోలీసులు విచారణ చేయడం లేదని బీహార్ డీజీపీ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ తరపున డిప్యూటీ సీఎంగా ఉన్న సుశీల్ మోడీ నేరుగా విమర్శలు చేస్తున్నారు. అక్కడ….ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే.. అసలు టార్గెట్ మహారాష్ట్ర సీఎం అన్న ప్రచారం కూడా ఉంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాకరే కుమారుడు… సుషాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు .. ఆ ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాడని కంగనా రనౌత్ లాంటి వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. సీబీఐకి కేసు అప్పగిస్తే.. ఈ విషయంపై.. సీబీఐ దృష్టి పెడుతుంది. అందుకే.. సీబీఐకి.. బీహార్ మీదుగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆపరేషన్ కమల్‌లో భాగంగా.. రాజస్థాన్ తర్వాత మహారాష్ట్రపై బీజేపీ గురి పెట్టిందని చెబుతున్నారు. ఈ క్రమంలో.. సుషాంత్ ఆత్మహత్య కేసు… బీహార్ మీదుగా… ఢిల్లీకి చేరడం.. అందులో ఉద్ధవ్ కుమారుని పేరు వినిపించడం కలకలం రేపుతోంది. సాధారణంగా అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే మాత్రమే సీబీఐ ఆ రాష్ట్రంలో విచారణ చేయాల్సి ఉంటుది. కోర్టులు ఆదేశిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ కోణంలోనే కోర్టు ద్వారా ఆదేశాలు పొందడానికి ప్రయత్నిస్తోందని శివసేన అనుమానిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close