కొత్త పలుకు: పవన్‌కు బీజేపీ గేలం

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లో వచ్చే కొత్తపలుకు, వీకెండ్ కామెంట్ ప్రోగ్రాం ల పై రాజకీయ వర్గాలు ఆసక్తి కనబరుస్తూ ఉంటాయి. విశ్లేషణ పూర్తిగా ఏకపక్షంగా టిడిపి కి అనుకూలంగా చేసినా, ప్రతి అంశాన్ని టిడిపి కళ్ళద్దాల లోనుంచి చూసినా ఈ ప్రోగ్రాం పై రాజకీయవర్గాలు, ప్రేక్షకులు ఆసక్తి కనబరచడానికి కారణం – ఈ విశ్లేషణ సందర్భంగా ఎప్పుడూ ఏదో ఒక కొత్త “ఇన్ సైడ్ సమాచారాన్ని” ప్రేక్షకులకి ముందుగా అందించడమే. ఈ వారం కూడా అలాంటి కొత్తపలుకు ఒకటి పలికారు ఎబిఎన్ రాధాకృష్ణ. ఇంతకీ అదేంటంటే – బిజెపి, పవన్ ల మధ్య 2019 కి దోస్తీ.

తెలుగుదేశం పార్టీ దూరమైపోతున్నందున ప్రత్యామ్నాయంగా పవన్‌ కల్యాణ్‌ను తమవైపు తిప్పుకొంటే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నదనీ, పవన్‌ కల్యాణ్‌ చొరవ మేరకే రాష్ట్రానికి ఏదో చేసినట్టు చేసి ఎన్నికలలో ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న అంశం కేంద్ర నాయకత్వం పరిశీలనలో ఉందన్న సమాచారం ఉందనీ, ఈ కారణంగానే పవన్‌ కల్యాణ్‌ను గవర్నర్‌ తన వద్దకు పిలిపించుకుంటున్నారనీ, ఫోన్‌లో కూడా తరచుగా మాట్లాడుతున్నారనీ ఎబిఎన్ రాధాకృష్ణ ” కొత్త పలుకు ” విశ్లేషించింది.

మొత్తానికి, ఆ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానెల్ లో చెప్పిన అంశాలు , అంటే – బిజెపి టిడిపి తో తెగదెంపులు చేసుకుని, పవన్ తో వెళ్ళనుంది అని – ఆయన చెప్పిన “విశ్లేషణ” కి దగ్గరగా ఎబిఎన్ కథనం ఉండటం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com