తెలుగు రాష్ట్రాల్లో ఇక గవర్నర్ ద్వారా బీజేపీ పాలన..!

కర్ణాటకలో మినహా మరెక్కడా దక్షిణాదిలో అధికారంలో లేని భారతీయ జనతా పార్టీ…గవర్నర్ ద్వారా పరిపాలన సాగించబోతోంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించిన తర్వాత ఇక రాజకీయం … గతంలో ఉన్నట్లుగా ఉండదన్న అభిప్రాయానికి అందరూ చాలు సులువుగానే వస్తున్నారు. సాధారణంగా క్రియాశీల రాజకీయాల్లో లేని వారిని గవర్నర్లుగా నియమిస్తారు. బీజేపీ అలాంటివేమీ పెట్టుకోలేదు. ఆరెస్సెస్‌లో పనిచేసి, సంఘ్‌ కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఒక వైపు, ఇటీవలి కాలంలో కరుడుగట్టిన బీజేపీ వాదిగా పేరుపొందిన తమిళిసైను మరో వైపు రంగంలోకి దించాయి.

తెలుగు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో పార్టీ వ్యక్తులకే గవర్నర్ గిరి కట్టబెట్టారు. అందని ద్రాక్షలుగా ఉన్న ఏపీ, తెలంగాణలో కొత్త గేమ్ మొదలు పెట్టినట్లు నేరుగానే చెప్పేసింది. గతంలో తెలంగాణ టీఆర్ఎస్‌ సర్కారుతో స్నేహంగా మెలిగినట్లు కనిపించినా.. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ కేసీఆర్‌ను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పైగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని రాష్ట్ర నేతలు పదేపదే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల బీజేపీ నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అమరావతిపై కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ స్టాండ్ తీసుకుంది. ఏపీ గవర్నర్ ఇప్పటికే పాలనా వ్యవహారాల్లో కల్పించుకుంటున్నారు. కానీ ఏమీ అనలేని పరిస్థితి వైసీపీ. ఇది కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లను క్రియాశీలంగా ఉంచడం ద్వారా కొంత మేర ఫలితాలు సాధించే వీలుంటుందని పార్టీ నమ్ముతోంది.

ప్రాంతీయ ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టగల సమర్థులనే గవర్నర్‌గా ఎంపిక చేసింది. మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను స్వయంగా ప్రస్తావిస్తూ సర్కారును ఇరకాటంలో పెట్టడం లాంటివి గవర్నర్ల ద్వారా కేంద్రం అమలు చేసే వ్యూహం అవుతుందని గత అనుభవాలే చెబుతున్నాయి. ప్రభుత్వాలకు ప్రశ్నలు సంధించడం లాంటివి కూడా చేస్తుంటారు. దక్షిణాదిన కర్ణాటకలో ఒక చోటే బీజేపీ సర్కారు ఉంది. తమిళనాడు, కేరళ కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే ఏపీ, తెలంగాణపై మోదీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీలోకి భారీ సంఖ్యలో నాయకులు చేరుతున్నారు. దానితో పార్టీ బలపడేందుకు అవకాశం వస్తోంది. బలపడుతున్న పార్టీని అధికార పీఠం వైపు నడిపించేందుకు గవర్నర్లు కీలకంగా వ్యవహరించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close