బీజేపీ వాదన : స్టీల్ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోలేదట..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు గడిపి.. తిరిగి వచ్చేసిన ఏపీ బీజేపీ నేతలు… కొత్త వాదన వినిపించడం ప్రారంభించారు. అదేమిటంటే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదట. కేంద్రం నిర్ణయం తీసుకోకుండానే… ఏపీలో అధికారపక్షం.. ప్రతిపక్షం.. బీజేపీపై కుట్ర చేసి మరీ ప్రచారం చేస్తున్నాయట. ఈ విషయాన్ని వంద సార్లు చెప్పాలన్న లక్ష్యంతో జీవీఎల్ నరసింహారావు ఏపీకి వచ్చేశారు. ఆయనతో పాటు సోము వీర్రాజు సహా ఇతర ముఖ్య నేతలంతా కోరస్‌గా అదే మాట వినిపించడం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని… కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం రికార్డెడ్. ఈ ఉపసంహరణ బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే ఇచ్చారు. ఇదంతా కేబినెట్ సెక్రటరీ ట్వీట్ చేశారు కూడా. ఆ తర్వాత ఈ విషయం రగడ ప్రారంభమయింది. కేంద్రం కూడా… ఇంత గొడవ జరుగుతున్నా… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదని ఎక్కడా చెప్పడం లేదు. కానీ .. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ఏపీకి వచ్చి దబాయిస్తున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోలేదని.. కానీ ప్రజల్ోల ఇతర పార్టీలు అపోహలు కల్పిస్తున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెంటిమెంట్‌గా మారిందని.. ప్రక్రియను ఆపడానికి ఏదో ఒకటి చేయాలని ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. అక్కడ వారికి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. కానీ … నిర్ణయం తీసుకోలేదని ఎదురుదాడి చేయాలని చెప్పి పంపేసినట్లుగా ఉన్నారు. అందుకే.. వారు ఏపీకి వచ్చి… ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు.. అనేక రకాలుగా ఏపీ ప్రజల్ని వంచించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి తీరు ప్రజల్ని మరింత అసహనానికి గురి చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close