అవసరమైన చోటే అన్న క్యాంటీన్లు ఉంచుతారట..!

అన్న క్యాంటీన్లను రద్దు చేసే ఉద్దేశం లేదని.. అసెంబ్లీలో చెప్పిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ… అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మాత్రం.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. ఆగస్టు ఒకటో తేదీ నుంచే వాటిని మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో… ఎన్నికలకు ఆరేడు నెలల ముందు ప్రారంభించిన ఈ క్యాంటీన్లు.. పేదల కడుపు నింపాయి. మూడు పూటలా.. రుచికరమైన అల్పాహారం.. భోజనాలు అందిస్తూండటంతో.. చిరుద్యోగులు, రోజు కూలీలు.. తమ ఆకలిని ఈ క్యాంటీన్ల వద్దే తీర్చుకునేవారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో.. వాటికి గ్రహణం పట్టింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో… ఒక్కో క్యాంటీన్‌ను మూసేస్తూ వస్తున్నారు.

వారం రోజుల క్రితం.. మొత్తం అన్న క్యాంటీన్లకు… తెలుగు రంగు పూశారు. పసుపు రంగు కనిపించకుండా.. కేవలం క్యాంటీన్ అన్న పేరు మాత్రమే ఉండేలా.. తెల్లరంగు వేశారు. రాజన్న క్యాంటీన్ పేరు పెట్టి అయినా కొనసాగిస్తారని అనుకున్నారు కానీ… ఇప్పుడు మూసేయాలని.. ప్రభుత్వం నిర్ణయించుకుంది. అసెంబ్లీలో బుగ్గన.. అన్న క్యాంటీన్ల వల్ల లాభమేం లేదని.. వ్యాఖ్యానించడం.. ప్రభుత్వ దృక్పధాన్ని తెలియచేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బొత్స వాటిని నిలిపివేత నిర్ణయాన్ని బయట ప్రకటించారు. గతంలో ఒక్కో చోట 900 మంది తింటే..ఇప్పుడు ఆ సంఖ్య 600కి తగ్గిందని …అలా తగ్గిపోతున్న చోట అన్నా క్యాంటీన్లను తొలగిస్తాని స్పష్టం చేశారు.

అయితే బస్టాండ్లు, ఆస్పత్రుల దగ్గర మాత్రం ఉంచుతామన్నారు. గత ప్రభుత్వం అవసరం లేని చోట కూడా క్యాంటీన్లు పెట్టిందన్నారు. కొనసాగిచే చోట.. అక్షయపాత్ర వాళ్లే క్యాంటీన్లు నిర్వహిస్తారని.. ప్రస్తుతం ఉన్న రేట్ల మీద అభ్యంతరం లేదని బొత్స ప్రకటించారు. అసెంబ్లీలో అన్న క్యాంటీన్లపై చర్చ సందర్భంగా.. వైసీపీ సభ్యులు అవినీతి ఆరోపణలు చేశారు. తెలంగాణతో పోల్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఏపీలో అన్న క్యాంటీన్‌కు 30 లక్షలకుపైగా ఖర్చు చేశారని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close