బాక్సాఫీస్ బిగ్గెస్ట్ ఫైట్ – చిరు, బాల‌య్య వార్‌…

2017 సంక్రాంతి.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర బిగ్గెస్ట్ ఫైట్ చూడ‌బోతున్నాం. చిరంజీవి, బాలకృష్ణ‌లు నువ్వా, నేనా అంటూ… ఢీ కొట్ట‌బోయే అరుదైన దృశ్యం సంక్రాంతికి ఆవిష్కృతం కానుంది. అవును.. చిరు, బాల‌య్య‌లు సంక్రాంతి బ‌రిలో దిగ‌బోతున్నారు. చిరు క‌త్తి, బాల‌య్య గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతికే విడుద‌ల కానున్నాయి. ఈ విష‌యాన్ని ఆయా చిత్ర‌బృందాలు కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఇటీవ‌లే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రం క్లాప్ కొట్టుకొంది. ఈ వార‌మే.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈరోజు చిరంజీవి 150వ చిత్రం క‌త్తి కూడా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. క‌త్తి సినిమానీ సంక్రాంతికే విడుద‌ల చేస్తామని చిత్ర‌బృందం చెబుతోంది. అంటే.. బాల‌య్య‌, చిరు ఫైట్ ఖాయ‌మ‌న్న‌మాట‌.

అటు చిరంజీవికి ఇది 150వ చిత్రం.. బాల‌య్య‌కు వందో చిత్రం. ఎవ‌రి దృష్టిలో వారికది ప్ర‌త్యేక చిత్రం. ముందుగా సంక్రాంతికి క‌ర్చీఫ్ వేసుకొని మ‌రీ వ‌స్తున్నారు. 8 నెల‌ల ముందే… సంక్రాంతి బెర్తులు ఖాయం చేసుకొందామ‌ని చూస్తున్నారంటే… చిరు, బాల‌య్య‌ల ముందు చూపేంటో అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ అగ్ర క‌థానాయ‌కుల్లో గెలుపు జెండా ఎగ‌రేసేది ఎవ‌రో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close