షాకింగ్‌… బోయ‌పాటి రిటైర్‌మెంట్‌?

మ‌న‌కున్న మాస్‌, క‌మర్షియ‌ల్ ద‌ర్శ‌కుల్లో బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌డు. ప‌ట్టాడండే సినిమా హిట్టే. ద‌మ్ము ఒక్క‌టి మిన‌హాయిస్తే.. మిగిలిన సినిమాల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడాయి. ఇప్పుడు స‌రైనోడు కీ మంచి క్రేజ్ ఉంది. అయితే.. బోయ‌పాటి శ్రీ‌ను మాత్రం… ”నేను చేసేది మ‌హా అయితే ప‌ది సినిమాలంతే.. ”అంటూ వేదాంత ధోర‌ణిలో మాట్లాడుతున్నాడు. దానికి కార‌ణం ఉంది. ”చేతిలో మూడు నాలుగు సినిమాలు పెట్టుకోవ‌డం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండ‌దు. సినిమా త‌ర‌వాత సినిమా చేస్తా. అదీ టైమ్ తీసుకొంటా. అందుకే నేను ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా త‌క్కువ సినిమాలు చేశా. నా కెరీర్‌లో మ‌హా అయితే మ‌రో ప‌ది సినిమాలు చేస్తానేమో? త‌క్కువ సినిమాలు చేసినా ఫ‌ర్వాలేదు. కానీ మంచి సినిమాలే ఇవ్వాలి. ఎందుకంటే మ‌నం రేపు ఉండొచ్చు ఉండ‌క‌పోవొచ్చు. కానీ మ‌న సినిమా ఉంటుంది. అది చ‌రిత్ర‌.. దాన్ని కాపాడుకోవాలి” అంటున్నాడు బోయ‌పాటి.

అంటే బోయ‌పాటి ఇలా నెమ్మ‌దిగానే సినిమాలు తీస్తాడ‌న్న‌మాట‌. త‌ను చెప్పిందీ నిజ‌మే ఇలా యేడాదికో సినిమా చేసుకొంటూ పోతే. ప‌దికి మించి ఇంకేం చేయ‌గ‌ల‌డు? ఆ త‌ర‌వాత రిటైర్‌మెంటే ఇక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close