బెల్లం కొండ‌ని బెద‌ర‌గొట్టేసింది

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ మాదిరి హీరోయిన్ల‌తో సినిమాలు చేయ‌డేమో. తొలి సినిమాకే స‌మంత‌ని ప‌ట్టేశాడు. త‌మ‌న్నాని ఐటెమ్ గాళ్‌గా మార్చుకొన్నాడు. మూడో సినిమాకి ర‌కుల్ ప్రీత్‌సింగ్ ని ఎంచుకొన్నాడు. అల్లుడు శ్రీ‌ను కోసం స‌మంత‌కు రెండు కోట్ల పారితోషికం ఇచ్చార‌ని, త‌మ‌న్నాకు రూ.75 ల‌క్ష‌ల వ‌ర‌కూ చ‌దివించుకొన్నార‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ర‌కుల్ కూడా ఏం త‌గ్గ‌డం లేదు. పారితోషికం పేరుతో బెల్లం కొండ‌ని బెద‌ర‌గొట్టేస్తోంది. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శక‌త్వంలో బెల్లంకొడ శ్రీ‌నివాస్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌కుల్‌ని ఎంచుకోవాల‌నుకొంటున్నారు. అయితే ర‌కుల్ పారితోషికం ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా??

ఈ సినిమా కోసం ఏకంగా రూ.కోటిన్న‌ర అడిగింద‌ట‌. సాధార‌ణంగా ర‌కుల్ పారితోషికం కోటి రూపాయ‌ల లోపే. కానీ చేయాల్సింది బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో కాబ‌ట్టి కోటిన్న‌ర డిమాండ్ చేసింద‌ని టాక్‌. అయితే ఇంకో షాకేంటంటే.. అడిగినంత ఇవ్వ‌డానికి చిత్ర‌బృందం కూడా ఒప్పుకొంది. పెద్ద ద‌ర్శ‌కుడు, ఓ స్టార్ హీరోయిన్ ఉంటే సినిమాకి వ‌చ్చే క్రేజ్ వేర‌ని.. వాళ్ల న‌మ్మ‌కం. అందుకే ర‌కుల్ పంట పండింది. అన్న‌ట్టు ఈ చిత్రానికి అభిషేక్ పిక్చ‌ర్స్ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టింది. అయితే వెనుక ఉండి డ‌బ్బులు అందిస్తోంది మాత్రం బెల్లంకొండ సురేష్ అని వినికిడి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close